Pawan Kalyan : పవన్ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఖాయమే.. ఇండియా టుడేతో క్లారిటీ..!
Qubetvnews - June 10, 2024 / 06:59 PM IST
Pawan Kalyan : ఏపీలో, అటు కేంద్రంలో ఈసారి ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దాంతో మూడోసారి కేంద్రంలో మోడీ సర్కార్ కొలువుదీరింది. ఇటు రాష్ట్రంలో జనసేన పార్టీ తొలిసారి ప్రభుత్వంలోకి వచ్చింది. దాంతో ఆ పార్టీకి ఇప్పుడు ప్రభుత్వంలో కీలక స్థానం దక్కబోతోంది. అయితే కూటమి గెలుపులో పవన్ కల్యాణ్ చాలా ప్రధాన పాత్ర పోషించారు. ఆయన వల్లేకూటమి గెలిచిందనే ప్రచారం జాతీయ మీడియాలో కూడా జరుగుతున్న నేపథ్యంలో.. పవన్ కల్యాణ్ కు కచ్చితంగా డిప్యూటీ సీఎం పదవి వరిస్తుందనే టాక్ పెద్ద ఎత్తున నడుస్తోంది.
అయితే దానిపై గతంలో లోకేష్ మాట్లాడుతూ పవన్ కల్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలా వద్దా అనేది పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అయితే ఇప్పుడు కూటమి గెలుపులో కీలకంగా మారిన పవన్ కు కచ్చితంగా కేంద్రమంత్రి పదవి ఖయాం అని అంటున్నారు. దానిపై పవన్ కూడా క్లారిటీ ఇచ్చారు. ఢిల్లీలో ఆయన ఇండియా టుడేతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన డిప్యూటీ సీఎం పదవిపై స్పందించారు. తాను పదవి తీసుకోవడానికి సానుకూలంగానే ఉన్నట్టు తెలిపారు. కాగా ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ రోజు సాయంత్రం పవన్ కల్యాన్ చంద్రబాబుతో భేటీ అవుతారని తెలుస్తోంది. రాష్ట్ర మంత్రి వర్గంపై చర్చించబోతున్నారు. రేపు మంత్రి వర్గ స్థాయి సమావేశం నిర్వహిస్తారు. ఇందులో ఏ పార్టీకి ఎన్ని పదవులు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలనే దానిపై క్లారిటీ రాబోతోంది. కాగా దానిపై ఇప్పటి కూటమిలోని ఏ పార్టీ కూడా స్పందించట్లేదు. కానీ పవన్ కల్యాణ్ కు మాత్రం కచ్చితంగా డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని కూటమి పార్టీలు అనుకుంటున్నాయి. ఎందుకంటే పవన్ కల్యాణ్ లాంటి క్లీన్ ఇమేజ్ ఉన్న నేత ప్రభుత్వంలో ఉంటే.. ఆటోమేటిక్ గా కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో అంచనాలు పెరుగుతాయని వారు భావిస్తున్నారు.
ఒకవేళ పవన్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వకపోతే ఏపీలోని మెజార్టీ సామాజిక వర్గాలు కూటమికి వ్యతిరేకంగా మారే అవకాశం కూడా ఉంది. ఎలాగూ చంద్రబాబే సీఎం కాబట్టి.. డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడానికి పెద్దగా ఇబ్బందేమీ ఉండదని భావిస్తున్నారు. అందుకే పవన్ వైపు అందరూ చూస్తున్నారు.
పైగా పవన్ కు డిప్యూటీ సీఎం పదవి ఇస్తే.. జనసేనకు ఎక్కువ మంత్రి పదవులు ఇవ్వాల్సిన అవసరం ఉండదని కూడా చంద్రబాబు భావిస్తున్నారంట. తనను నమ్ముకున్న వారికి న్యాయం చేశాడు అనే కీర్తి కూడా చంద్రబాబుకు పెరుగుతుందని టీడీపీ భావిస్తోంది. మరి చంద్రబాబు ఏం చేస్తారో.




