Dr Botcha Jhansi Lakshmi : విశాఖ అభివృద్ధి జగనన్నతోనే సాధ్యం.. ప్రచారంలో దూసుకుపోతున్న బొత్స ఝాన్సీ లక్ష్మీ……………
Qubetvnews - April 22, 2024 / 02:21 PM IST
Dr Botcha Jhansi Lakshmi :
ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతూ అన్ని వర్గాల ప్రజలతో మమేకం అవుతున్నారు వైసీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మీ. వై నాట్ వన్ సెవెన్టీ ఫైవ్ అని ధైర్యంగా చెప్పడమే కాదు.. త్వరలోనే మరోసారి ముఖ్య మంత్రిగా విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తా అని వేదికను కూడా ఖరారు చేసిన జగన్ వెంటే విశాఖపట్నం ప్రజలు నిలవాలనన్నారు ఝాన్సీ లక్ష్మీ.
విశాఖ సీతంపేట లోని సెంట్రల్ లైబ్రరీ లో అఖిల గాండ్ల, తెలికుల సంక్షేమ సంఘం ఐక్య కార్యాచరణ సమితి ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు ఝాన్సీ లక్ష్మి. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. విశాఖపట్నం పరిపాలనా రాజధాని ఐతే విశాఖ వాసుల జరుగుతుందన్నారు. మళ్లీ వైసీపీ ప్రభుత్వం పస్తేనే ప్రజా సంక్షేమం మరింత పెరుగుతోందన్నారు.
ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్ వి వి సత్యనారాయణ, ఉత్తర నియోజక వర్గ అభ్యర్థి కే కే రాజు, వైసీపీ లీడర్లు పాల్గొన్నారు.





