Survey : ఏపీలో మళ్లీ వైసీపీదే అధికారం.. తేల్చి చెప్పిన ప్రముఖ సర్వే..!
Qubetvnews - April 15, 2024 / 09:26 PM IST
Survey : ఎన్నికలు దగ్గరపడుతున్నాయంటే అన్ని పార్టీలు ఎవరికి వారే అధికారంపై అంచనాలు వేసుకుంటారు. ఎవరికి వారే సొంతంగా సర్వేలు కూడా చేయించుకుంటారు. అఫ్ కోర్స్.. పార్టీలు చేసుకునే సర్వేల్లో తమకే అనుకూల ఫలితాలు రావచ్చు గానీ.. ఎన్నికలు ఉన్న రాష్ట్రంలో కొన్ని ప్రముఖ సర్వే సంస్థలు వచ్చి ఇప్పుడు సర్వేలు చేస్తున్నారు. అందులో కొన్ని మీడియా సంస్థలు ఉంటే ఇంకొన్ని ప్రముఖ సర్వే సంస్థలు కూడా ఉంటాయి. ఇప్పుడు కూడా ఏపీలో చాలా సర్వే సంస్థలు వచ్చి సర్వేలు నిర్వహిస్తున్నాయి. అయితే ఎవరు సర్వే చేసినా ఫలితం ఒకటే వస్తోంది.
వైసీపీదే మరోసారి అధికారం అని ఢంకా బజాయించి మరీ అన్ని సర్వేలు చెబుతున్నాయి. ఇప్పటికే చాలా సర్వే సంస్థలు వచ్చి ఈ విషయాన్ని చెప్పగా తాజాగా *elecsence* అనే సర్వే సంస్థ కూడా తన ఫలితాలను వెల్లడించింది. 25 మార్చి నుంచి ఏప్రిల్ 12 వరకు ఏపీలో సర్వే చేసినట్టు ఈ సంస్థ తెలిపింది. ఇందులో వైసీపీకి 127 సీట్లు వస్తాయని స్పష్టం చేసింది. తిరుగులేని మెజార్టీతో మరోసారి అధికారంలోకి వస్తుందని సర్వే వివరించింది. ఇక తమదే అధికారం అని గగ్గోలు పెడుతున్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి పెద్ద షాక్ తగిలింది.
ఆ కూటమికి కేవలం 48 సీట్లు మాత్రమే వస్తాయని ఈ సర్వే వివరించింది. ఇక షర్మిల రాకతో కాంగ్రెస్ కు ఊపు అని ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ కూటమికి దిమ్మతిరిగే షాక్ తగిలింది. కనీసం ఒక్క ఎమ్మెల్యే సీటుకూడా రాదని ఈ సర్వే చెప్పింది. ఇతరులు కూడా ఏ ఒక్క సీటను గెలవలేరని ఈ సర్వే వెల్లడించింది. ఎమ్మెల్యే సీట్లపైనే ఈ సర్వే చేశారు. కాగా సీట్లు మొత్తం వైసీపీ, టీడీపీ కూటమి అభ్యర్థులే గెలుచుకుంటారని వివరించింది ఈ సర్వే. ఇక ఓటింగ్ షేర్ చూస్తే వైసీపీకి 50.38, టీడీపీ కూటమికి 45.58, కాంగ్రెస్ కూటమికి 1.38, ఇతరులు 2.66 ఓటు తెచ్చుకుంటారని వివరించింది.
ఈ సర్వే మొత్తాన్ని 86,200 మందిపై చేశారు. స్పస్టమైన ఫలితాలను ఇస్తున్నట్టు తెలిపింది ఈ సర్వే. దాంతో వైసీపీలో జోష్ నెలకొంది. జగన్ చేసిన సంక్షేమం, అభివృద్ధి ఫలితాలే ఇప్పుడు ఎన్నికల్లో కనిపిస్తున్నాయని అంటున్నారు వైసీపీ నేతలు. ఏ సంస్థ వచ్చి సర్వే చేసినా గెలుపు మాత్రం వైసీపీదే అని మురిసిపోతున్నారు.




