Janasena Party : ఏంటి పవనూ ఇది. మళ్లీ జ్వరం.. ప్రచారానికి విరామం. కష్టమే……………………….
Qubetvnews - April 22, 2024 / 02:08 PM IST
Janasena Party :
జనసేనానికి మళ్లీ జరమొచ్చింది. ఒక్క జ్వరమే కాదు.. శ్వాసకోశ సమస్య ఉండడంతో అప్పుడప్పుడూ ఎలర్జీ కూడా వస్తోంది. అందుకే భక్తులకు తీసిపోని హార్డ్ కోర్ అభిమానులైనా సరే.. ఆయన మీద పూలు చల్లొద్దు. అల్లంత దూరం నుంచే హారతిచ్చి దండం పెట్టుకుని ఆయన రూపాన్ని గుండెల్లో నింపుకోవాలి. షేక్ హ్యాండ్స్ ఆలోచనే బ్యాన్.. అంటూ క్యాడర్ కు జనసేన పార్టీ ఓ సూచన చేసింది.
హ్మ్.. రెండ్రోజులు ఎండల్లో తిరిగితే మూడ్రోజులు రెస్ట్ తీసుకునే పవర్ స్టార్.. సీఎం జగన్ మీద జరిగిన రాళ్ల దాడిని గులక రాయి అని ఎగతాళిగా మాట్లాడతారు. కత్తితో దాడి చేసినా కామెంట్స్ పాస్ చేస్తారు. యాక్షన్ అనగానే రోప్స్ సాయంతో వందల మందిని ఎగరేసి ఫైట్ చేసే వెండితెర కాటమరాయుడు.. జనంలోకొస్తే మాత్రం నన్ను బ్లేడ్లతో కొస్తున్నారని లబోదిబోమంటారు.
ఈయన్ని నమ్మి కార్యకర్తలు, అభ్యర్థులు, అభిమానులు ఎండనకా, తిండనకా తిప్పలుపడుతుంటే.. సారు వారు మాత్రం చిన్న జ్వరమొచ్చినా ఛలో హైద్రాబాద్ అని వరుసగా వారం రోజులు ఆరామ్ గా రెస్ట్ తీసుకుంటారంటూ జనసేన క్యాడరే కుమిలిపోతున్నారు. హాయిగా సెట్లలో సినిమాలు తీసుకోక, ఎందుకీ పొల్టికల్ ఫీట్లు అంటూ గాజు గ్లాస్ క్యాడరే నారాజవుతోంది పాపం. స్కూలుకెళ్లే చిన్న పిల్లాడిలా జ్వరం, ఎలర్జీ అని సాకులు చెప్పే ఇలాంటి వాళ్లు ప్రజాక్షేత్రంలో ఎలా నిలబడతారంటూ పొలిటికల్ నిపుణులు కూడా ఓపెన్ గానే కామెంట్ చేస్తోన్న పరిస్థితొచ్చింది పాపం.




