Mudragada Padmanabham : కాపుల్లో చెరగని ‘ముద్ర’గడ.. వైసీపీలోకి రావడం సరైన మార్గమే..!

Qubetvnews - March 15, 2024 / 05:03 PM IST

Mudragada Padmanabham : కాపుల్లో చెరగని ‘ముద్ర’గడ.. వైసీపీలోకి రావడం సరైన మార్గమే..!

Mudragada Padmanabham : ముద్రగడ పద్మనాభం.. ఈ పేరు అంటే ఏపీలో తెలియని వారు ఉండరు. దశాబ్దాలుగా కాపుల సంక్షేమం, వారి హక్కుల కోసం పోరాడుతున్న యోధుడు. ఎలాంటి స్వప్రయోజనాలు ఆశించకుండా.. తన సామాజిక వర్గం అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా నిస్వార్థంగా పోరాడుతున్న వ్యక్తి అంటే అందరికీ టక్కున ముద్రగడ పేరే వినిపిస్తుంది. ఇప్పటి వరకు కాపుల్లో ముద్రగడకు గట్టి పట్టు ఉంది. కాపుల ఐకాన్ గా ఆయన్ను చూస్తుంటారు ఆయన సామాజిక వర్గం నేతలు. అందులో ఎలాంటి అనుమానాలు లేవు. చాలా మంది స్వార్థం కోసం కులం పేరు ఎత్తుకుంటారు.

కానీ ముద్రగడ మాత్రం తన సామాజిక వర్గం అభివృద్ధి కోసమే పోరాడుతుఉన్నారు. కాపుల కోసం ఎన్నో త్యాగాలు చేశారు. టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉండి మరీ కాపుల కోసం రాజీనామా చేశారు. కాపు ప్రయోజనాల కోసం ఎన్నో త్యాగాలు చేశారు. ఉద్యమాలు చేపట్టారు. అయితే కాపుల కోసం పోరాడుతున్న ముద్రగడ.. తనను చంద్రబాబు కావాలనే అరెస్ట్ చేయించి వేధిస్తున్నాడంటూ చాలా సార్లు మొరపెట్టుకున్నారు. చివరకు తన ఫ్యామిలీని కూడా ఇబ్బంది పెడుతున్నారంటూ వాపోయాడు ముద్రగడ. దీంతో కాపుల్లో చంద్రబాబు పట్ల తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది.

ఆ మధ్య ముద్రగడ జనసేనలో చేరుతారని ప్రచారం జరిగింది. కానీ కుల రాజకీయాల పొత్తులో భాగంగా ముద్రగడ రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని ముద్రగడ అభిమానులు ఆరోపిస్తున్నారు. పైగా పవన్ కల్యాణ్‌ కాపుల కోసం పోరాడుతున్న ముద్రగడ పద్మనాభం, చేగోండి హరిరామజోగయ్యలను పరోక్షంగా కామెట్ చేయడంపై కాపుల్లో తీవ్ర నిరసన వ్యక్తమైంది. కాపులకు అండదండగా ఉంటున్న వైసీపీలో చేరడంతో కొంత బలం చేకూరనుంది. ఉభయగోదావరి జిల్లాల్లో కాపుల సంఖ్య బలంగా ఉంది. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో 34 స్థానాల్లో కాపుల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. పద్మనాభం చేరికతో పార్టీకి బలం పెరగనుంది.

ముద్రగడ కూడా తన కాపుల సంక్షమాన్ని కోరుకుంటున్న జగన్ నాయకత్వాన్ని నమ్ముతున్నారు. ఎందుకంటే జగన్ కూడా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాపుల సంక్షేమం కోసం చాలానే చేశారు. కాపు సామాజికవర్గంలో ఆర్దికంగా వెనుకబడిన వారికి చేయూతనిచ్చారు. అలాగే దాదాపు 2 ఎంపీ స్థానాలు, 19 ఎమ్మెల్యే స్థానాలను కాపు అభ్యర్ధులకు కేటాయించారు.

కాపు నేస్తం తో ఎంతోమంది మహిళలకు సైతం ఆర్థికంగా బాసటగా నిలిచారు. పద్మనాభం వైసీపీలో చేరికతో కాపుల ఓట్ల జనసేన వైపు మళ్లకుండా కాకుండా ముద్రగడ అడ్డుకునే అవకాశం ఉంది. కాబట్టి ముద్రగడ ఇప్పుడు వైపీపీలోకి రావడం వల్ల కాపుల ఓట్లు మెజార్టీగా వైసీపీకే వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News