Chandrababu : చంద్రబాబు గెలిస్తే సర్వం నాశనం.. రాష్ట్రం కుదేలైపోతుందేమో..!

Qubetvnews - May 10, 2024 / 05:07 PM IST

Chandrababu : చంద్రబాబు గెలిస్తే సర్వం నాశనం.. రాష్ట్రం కుదేలైపోతుందేమో..!

Chandrababu : చంద్రబాబు కుట్రలను దగ్గరుండి మరీ చూస్తున్న ఏపీ ప్రజలు ఇప్పుడు టీడీపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అంటున్నారు వైసీపీ నేతలు. ఎందుకంటే ఇన్ని రోజులు చంద్రబాబు మంచితనం ముసుగేసుకుని ప్రజల ముందుకు వచ్చారు. తీరా ఎన్నికల సమయం వచ్చేసరికి ఆయన కుట్రలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయని వైసీపీ ఆరోపిస్తోంది. వాస్తవానికి చంద్రబాబు రాష్ట్రం సర్వనాశనమే అని వైసీపీ పదే పదే చెబుతూనే ఉంది. ఎందుకంటే చంద్రబాబు గతంలో పేద పిల్లలకు ఇంగ్లిష్ మీడియం వద్దని వ్యతిరేకించాడు. కానీ జగన్ పట్టుబట్టి పేద పిల్లలకు ఇంగ్లిష్ విద్యను నేర్పిస్తుంటే.. ఈరోజు వారు సాధిస్తున్న విజయాలను చూసి చంద్రబాబుకు నిద్ర పట్టట్లేదు.

అంతెందుకు పిన్షన్లర్లు కూడా చంద్రబాబు హయాంలో ఎంతో ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో పేదలకు పెన్షన్లు ఇస్తుంటే వాటిని కూడా అడ్డుకున్నారు. ఎన్నికల సమయంలో వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇవ్వడాన్ని ఈసీకి ఫిర్యాదు చేయించి మరీ అడ్డుకున్న కర్కశుడు చంద్రబాబు అని వైసీపీ ఆరోపిస్తోంది. అలాంటి వ్యక్తి మళ్లీ సీఎం అయితే మాత్రం పిన్షనర్లు అరిగోసలు పడాల్సిందే అని అంటున్నారు. అటు మహిళలకు దొంగ హామీలిచ్చి గతంలో మోసం చేసిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ గెలిస్తే మాత్రం తీవ్రంగా నష్టం చేస్తాడని అంటున్నారు.

ఇక చంద్రబాబు గెలిస్తే గ్రామీణ ఆర్థికవ్యవస్థ కుప్పకూలుతుంది.. పేదల ఇళ్లలో వెలుగుండదు…వారి కంచంలో మెతుకుండదు. ఎందుకంటే చంద్రబాబుకు వ్యవసాయం చేసేవారు అన్నా, మట్టి వాసన అన్నా అస్సలు పడదని ఇప్పటికే వైసీపీ పదే పదే ఆరోపణలు గుప్పిస్తోంది. చంద్రబాబు హయాంలో ఉచిత కరెంట్ ఉండదని అంటున్నారు వైసీపీ నేతలు. ఇక పేదల బతుకులు బాగుపడటం కూడా చంద్రబాబుకు నచ్చదని.. అందుకే ఈసారి ఆయన గెలిస్తే గనక డబ్బులు వేయడం ఆపేస్తారని చెబుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే పేదలకు వచ్చే డబ్బులను కూడా ఆపేయించారు చంద్రబాబు.

ఈసీకి ఫిర్యాదులు చేసి మరీ ఆపించారు. అంతే కాకుండా కోర్టులో పిటిషన్లు వేసి మరీ డబ్బులు రాకుండా అడ్డుకున్న చంద్రబాబు రేపు ఆయన గెలిస్తే ఎలా పేదలను ఆదుకుంటారని అంటుననారు. కాబట్టి చంద్రబాబు మరోసారి గెలిస్తే మాత్రం కచ్చితంగా పేదలకు అన్యాయమే జరుగుతుందని చెబుతున్నారు.

కేవలం కార్పొరేట్ వ్యవస్థలను మంత్రమే పెంచిపోషించడం మాత్రమే ఆయనకు తెలుసని.. ఆయన వర్గం వారికి మాత్రమే దోచిపెట్టడం చంద్రబాబుకు అలవాటు అని వైసీపీ పదే పదే ఆరోపణలు గుప్పిస్తూనే ఉంది. కాబట్టి మరోసారి సీఎంగా జగన్ ను చూడాలంటూ చెబుతున్నారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News