Jagan : ఇక జనంలోనే జగన్.. కలిసొచ్చిన ఫార్ములానే నమ్ముతున్న వైసీపీ

Qubetvnews - July 21, 2024 / 02:13 PM IST

Jagan : ఇక జనంలోనే జగన్.. కలిసొచ్చిన ఫార్ములానే నమ్ముతున్న వైసీపీ

Jagan : మాజీ సీఎం జగన్ రూటు మార్చేశారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. జగన్ గతంలో చేసిన కొన్ని పొరపాట్లు మొన్నటి ఎన్నికల్లో దారుణంగా పార్టీని ఓడించేశాయి. దాంతో అప్పటి నుంచి జగన్ ఎవరిని పెద్దగా నమ్మట్లేదంట. తాను గతంలో ఏ ఫార్ములతో అయితే అధికారంలోకి వచ్చానో.. ఇప్పుడు కూడా అదే ఫార్ములాను కంటిన్యూ చేయాలని భావిస్తున్నారంట జగన్. గత ఐదేండ్లలో ఆయన పెద్దగా బయటకువ చ్చింది లేదు. ఐప్యాక్ టీమ్ ను బాగా నమ్మారు. వారు ఏం చెబితే దానికి తగ్గట్టు వ్యూహాలు మార్చుకుంటూ పోయారు. అంతే కాకుండా ఆయన చుట్టూ ఓ కోటరీని ఏర్పాటు చేసుకున్నారు.

అందులో ఉన్న కొందరు సలహాదారులు ఏం చెబితే దాన్ని ఫాలో అయ్యారు. జగన్ నేన మీ కోసం ఎన్నో సార్లు బటన్లు నొక్కాను.. మీరు నాకోసం రెండుసార్లు నొక్కండి అని అన్నారంటే.. కేవలం సంక్షేమ పథకాల డబ్బులు వేస్తే సరిపోదని జగన్ కు అర్థం అయింది. కాబట్టి ప్రజలకు ఎంత దగ్గరగా ఉంటే అంత బెటర్ అని ఆలోచిస్తున్నారంట. గత ఐదేండ్లు టీడీపీ, జనసేన పార్టీల నేతలు ప్రజల్లోనే బలంగా తిరిగారు. కాబట్టి వారు ప్రజలకు దగ్గరయి.. జగన్ కేవలం ప్యాలెస్ కు పరిమితం అయ్యాడు అనే విమర్శలు చేయడంతో అవి ప్రజల్లోకి బలంగా వెళ్లిపోయాయి.

అందుకే తాను ప్రజలకు దూరంగా ఉండొద్దని జగన్ నిర్ణయించుకున్నట్టు అర్థం అవుతోంది. అందుకే ఇప్పుడు జగన్ తాను కేవలం ప్రజలకు దగ్గరగా ఉంటేనే తనకు దారి కనిపిస్తుందని నమ్ముతున్నారంట. గతంలో 2014 నుంచి 2019 మధ్యలో ఆయన ప్రతిక్షనం ప్రజల్లోనే ఉన్నారు. అందుకే అఖండ విజయం ఆయన సొంతం అయిపోయింది. ప్రజల మధ్య ఉంటే ఆటోమేటిక్ వారు మనల్ని ఓన్ చేసుకుంటారు అనే విషయం జనగ్ కు కూడా అర్థం అయింది. అందుకే ఇక నుంచి కేవలం ప్రజల్లోనే ఉండేందుకు ఆయన నిర్ణయించుకున్నారని అర్థం అవుతోంది.

గతంలో తనకు కలిసి వచ్చిన ఫార్ములానే ఆయన మళ్లీ వాడుతున్నట్టు చెబుతున్నారు. జగన్ ఇక నుంచి తన వ్యూహాలు తానే రచించుకోవాలని అనుకుంటున్నారంట. అది కూడా ప్రజల్లోకి వెళ్తే వారి అభిప్రాయాలు ఎలా ఉన్నాయో అర్థం అవుతుంది కాబట్టి.. వ్యూహాలు వాటంతట అవే వస్తాయని చెబుతున్నారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News