Nagababu : నాగబాబు ఓవర్ యాక్షన్.. మరీ ఇంత అవసరమా..?

Qubetvnews - February 17, 2024 / 08:48 AM IST

Nagababu : నాగబాబు ఓవర్ యాక్షన్.. మరీ ఇంత అవసరమా..?

Nagababu :

ఇప్పుడు ఏపీలో ఏ పార్టీ బలంగా ఉందో అందరికీ తెలిసిందే. ప్రతిపక్ష పార్టీలు అన్ని ఒక్కటైపోయి వైసీపీని దెబ్బ తీయాలని చూస్తున్నాయి. బలమైన పార్టీ సింగిల్ గా వస్తుంది. బలం లేని పార్టీలే పొత్తులు పెట్టుకుంటాయి. ఇప్పుడు ఏపీలో అదే జరుగుతోంది. చిన్న పిల్లాడిని అడిగినా వైసీపీ బలంగా ఉందని చెబుతారు. అందుకే వైసీపి ఇప్పుడు వై నాట్ 175 అంటుంది. ఇందుకు బలమైన కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వైసీపీకి ఇప్పుడు 151 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. ఇప్పటి వరకు తెలుగు చరిత్రలో ఏ పార్టీకి కూడా ఇంత బలమైన సీట్లు రాలేదు.

పైగా గెలిపించినందుకు జగన్ కూడా అంతే విధేయతతో పాలన అందించారు. ఇప్పటి వరకు వైసీపీ మీద ఎలాంటి వ్యతిరేకత పవనాలు కూడా కనిపించట్లేదు. ఎన్నికలు దగ్గరకు వస్తున్న క్రమంలో అన్ని వర్గాలు జగన్ కే జై కొడుతున్నాయి. ఇంతటి బలంతో దూసుకుపోతున్న వైసీపీపై నాగబాబు కామెంట్లు మరీ ఓవర్ గా అనిపిస్తున్నాయి. వైసీపీకి ఒక్క సీటు కూడా రాకుండా జనసైనికులు చేయాలని ఆయన చెప్పడం వినడానికే విడ్డూరంగా ఉంది. ఎందుకంటే 151 ఎమ్మెల్యే సీట్లు ఉన్న వైసీపీకి ఒక్క సీటు కూడా రాకుండా ఉంటుందా.. విన్న వారు కూడా నవ్విపోదురు గాక.

కానీ నాగబాబుకు ఈ మాత్రం ధ్యాస కూడా లేకుండా పోయింది. గత ఎన్నికల్లో ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు గెలిచిన జనసేన పార్టీ 151 సీట్లు గెలిచిన వైసీపీకి ఇప్పుడు ఒక్క సీటు కూడా రాకుండా చేస్తుందా.. అసలు మతి ఉన్న మాటలేనా ఇవి అంటున్నారు వైసీపీ నేతలు. నాగబాబు మాటలు మరీ ఓవర్ గా ఉన్నాయని జనసైనికులే ఆక్షేపిస్తున్నారు. 151 సీట్లు ఉన్న వైసీపీ ఇంకో 24 సీట్లు గెలచుకోవాలని ఆశపడటంలో తప్పులేదు. కానీ సీటు కూడా రానివ్వం అని చెప్పడం మాత్రం ఆయన విజ్ఞతకే వదిలేయాలి. మరి నాగబాబు చెబుతున్నట్టు వైసీపీ నిజంగా అంత బలహీనంగా ఉందా అంటే ఆ సూచనలు కనిపించట్లేదు.

వైసీపీ బలంగా ఉందని టీడీపీ, జనసేన పొత్తులే చెబుతున్నాయి. ఒకవేళ నాగబాబు చెప్పినట్టే వైసీపీ బలహీనంగా ఉంటే జనసేన ఒంటరిగా పోటీ చేసి ఓడించొచ్చు కదా. అలా ఎందుకు చేయట్లేదు. మరి నాగబాబు అన్నట్టే జనసేనకు నిజంగా అంత సీన్ ఉంటే చంద్రబాబు ఎక్కువ సీట్లు ఇచ్చి ఉండే వారు కదా.

అలా చేయకుండా చంద్రబాబు ముష్టిపడేసి నట్టు ఓ 20 సీట్లు ఇస్తే వాటితోనే ఎందుకు మురిసిపోతోంది. వీటిని బట్టి అసలు ఏ పార్టీ బలంగా ఉంది, ఏ పార్టీ బలహీనంగా ఉందో ఇట్టే అర్థం అవుతోంది. నాగబాబు చెప్పిన మాటలు బహుషా జనసేనకే వర్తిస్తాయేమో అంటూ కౌంటర్లు వేస్తున్నారు వైసీపీ నేతలు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News