Chandrababu : అరాచకానికి పరాకాష్ట.. చంద్రబాబు ఇదేం దిగజారుడు..!
Qubetvnews - March 17, 2024 / 01:06 PM IST
Chandrababu : రాజకీయాల్లో విలువలు గల నాయకులకు మాత్రమే ప్రజల గౌరవం దక్కుతుంది. ఈ విషయం అందరికీ తెలుసు. ఎంత విలువలతో పని చేస్తే అంత గొప్ప స్థాయిలో ప్రజలు ఉంచుతారు. అలా కాదనిఅరాచకానికి తెరలేపితే మాత్రం పాతాళానికి తొక్కేస్తారు. ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న పనులు కూడా అలాగే ఉంటున్నాయి. ఆయన పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే.. రాబోయే ఎన్నికల్లో ఎ లాగైనా గెలవాలి. అందు కోసం ఎవరికి పార్టీలో చేర్చుకోవడానికి అయినా రెడీ అపోతున్నారు. ఏ పార్టీ నుంచి ఎవరు వస్తారా.. వారికి ఏ టికెట్ కేటాయించేసి అధికారంలోకి వచ్చేద్దామా అన్నట్టు ఎదురు చూస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది.
అయితే చంద్రబాబు కూడా తన విలువల మర్చిపోయి మరీ ఎవరిని పడితే వారిని చేర్పించేసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు టీడీపీలోకి వచ్చేందుకు ఎవరూ సిద్ధంగా లేరు కాబట్టి ఎవరికైనా రెడ్ కార్పెట్ పరిచేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేందుకు మాగుంట శ్రీనివాసులు రెడ్డిని చేర్చుకున్నారు. రీసెంట్ గా దేశ రాజకీయాలను కుదిపేసిన వాటిల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ అతిపెద్దది.. ఈ కేసులో ఇప్పటికే పెద్ద తలకాయలు అరెస్ట్ అవుతున్నారు. మాజీ సీఎం కేసీఆర్ కూతురు కూడా ఇందులో భాగంగానే అరెస్ట్ అయింది.
అయితే ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కుంటున్న మాగుంట శ్రీనివాసులును జగన్ పక్కన పెట్టేశారు. అవినీతి మరకలు ఉంటే ఎవరినైనా పక్కాన పెట్టేందుకు జగన్ సిద్ధంగానే ఉంటున్నారు. అయితే అలా జగన్ పక్కన పెట్టిన శ్రీనివాసులును ఇప్పుడు చంద్రబాబు చేరదీస్తున్నారు. ఆయన పార్టీలో చేర్పుకున్నారు. ఆయనకు ఒంగోలు టికెట్ ఇస్తామనే హామీ మీద చేర్చుకున్నారు. ఇదే ఇప్పుడు చంద్రబాబు మీద తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న వ్యక్తిని దేశ అత్యున్నత పార్లమెంట్ కు పంపాలని చంద్రబాబు డిసైడ్ అవ్వడం ఏంటని మండిపడుతున్నారు.
అవినీతి చేసిన వారు తప్ప చంద్రబాబుకు ఇంకెవరూ దొరకట్లేదా అనిఅడుగుతున్నారు. అవినీతి ఆరోపణలు వస్తున్నాయనే కదా జగన్ పక్కన పెట్టింది. మరి అలాంటి వారు చంద్రబాబుకు ఎలా గొప్పగా కనిపిస్తున్నారనే విమర్శలు ఇప్పుడు వైసీపీ నుంచి వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న పని అందరికీ ఆశ్చర్యంగా అనిపిస్తోంది.
ఇప్పుడు చంద్రబాబు ఈ ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పకుండా ఉండిపోతున్నారు. అటు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కొడుకు రాఘవ్ ను కూడా చేర్చుకున్నారు. రాఘవ్ అప్రూవర్ గా మారిపోయినంత మాత్రాన నేరస్తుడు కాకుండా పోతాడా అని వైసీపీ ప్రశ్నిస్తోంది. ఏదేమైనా చంద్రబాబు చేస్తున్న పనులు అధికారం కోసం ఎలాంటి అరాచకానికి అయినా తెరలేపుతాడా అని ప్రశ్నిస్తోంది వైసీపీ.





