Nara Bhuvaneshwari : జగన్ బాటలోనే నారా భువనేశ్వరి.. చెప్పకున్నా తెలిసోతోందే..!
Qubetvnews - February 24, 2024 / 11:34 AM IST
Nara Bhuvaneshwari :
రాజకీయాల్లో జగన్ ఓ ట్రెండ్ సెట్టర్ అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయన ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలు, చేస్తున్న పనులే ఇందుకు ప్రధాన ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఎలాంటి క్లిష్ట సమయాల్లో అయినా సరే జగన్ చాలా ధైర్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందుకే ఆయన్ను అందరూ ట్రెండ్ సెట్టర్ అని పిలుచుకుంటున్నారు. ఇక చాలా కాలం తర్వాత ఇప్పుడు నారా భువనేశ్వరి తీసుకున్న నిర్ణయం అచ్చం జగన్ ను పోలినట్టే ఉంది. ఇంకా చెప్పాలంటే జగన్ ను చూసి ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవాలంటూ వైసీపీ వారు చెబుతున్నారు.
అదేంటంటే.. చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు జైలుకు వెళ్లారనే బెంగతో చాలా మంది టీడీపీ కార్యకర్తలు, ఆయన అభిమానులు కొందరు గుండె ఆగి చనిపోయారంటే ఓ లిస్టును కూడా రెడీ చేసుకుంది నారా భువనేశ్వరి. అందులో మామూలుగా చనిపోయినా సరే చంద్రబాబు అకౌంట్ లో పడేశారనే ఆరోపణలు కూడా చాలానే వచ్చాయి. కానీ నారా భువనేశ్వరి వారిని పరామర్శించి చెక్కులు అందజేస్తానంటూ తెలిపారు. అయితే ఆమె కొన్ని రోజులు మాత్రమే చేసింది. ఆ తర్వాత చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె యాత్ర మధ్యంతరంగానే ఆగిపోయింది.
కాగా ఆమె మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ యాత్ర స్వార్థపూరితంగా ఉందంటూ ఆరోపణలు రావడంతో ఆమె తిరిగి ఇప్పుడు ఆ యాత్రను స్టార్ట్ చేయాలని భావించారు. ఇందులో భాగంగా మరణించిన వారి ఇండ్లకు వెళ్లి చెక్కులు అందజేస్తానని ముందుగా ఆమె ఇంట్లో వారికి చెప్పారంట. కానీ ఆమె మాటలను ఇంట్లో వారు ఒప్పుకోలేదని తెలుస్తోంది. అందరి ఇండ్లకు వెళ్లకుండా అందరినీ ఒకే దగ్గరకు పిలిపించుకుని ఒకేసారి ఇవ్వొచ్చు కదా అని ఇంట్లో వారు అన్నారంట. కానీ ఆమె మాత్రం అందరినీ ఒకే దగ్గరకు పిలవకుండా ఒక్కొక్కరి ఇంటికి వెళ్లి పరామర్శిస్తానంటూ చెప్పారు.
అయితే ఆమె ఈ యాత్రకు జగన్ ను స్ఫూర్తిగా తీసుకున్నారని అర్థం అవుతోందని అంటున్నారు వైసీపీ నేతలు. అప్పట్లో వైఎస్సార్ చనిపోయినప్పుడు కూడా చాలా మంది చనిపోయారు. ఆ సమయంలో జగన్ వారి ఇండ్లకు వెళ్లి పరామర్శించాలని అనుకున్నారు. కానీ కాంగ్రెస్ దానికి ఒప్పుకోలేదు. అందరినీ ఒకే వద్దకు పిలిపించుకుని ఇవ్వాలని తెలిపింది.
కానీ జగన్ దానికి ఒప్పుకోలేదు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి మరీ వారి ఇండ్లకు వెళ్లి పరామర్శించారు. అప్పుడు జగన్ చేసిన పనే ఇప్పుడు నారా భువనేశ్వరి చేస్తున్నారు. దాంతో ఇప్పుడు ఆమె యాత్రకు జగన్ చేసిన పనే స్ఫూర్తి అని చెప్పకనే చెబుతున్నారు వైసీపీ నేతలు.
