CM YS Jagan : పేలిన మాటల తూటాలు.. జగన్ ఆన్ ది ఫైర్..!

Qubetvnews - February 19, 2024 / 01:34 PM IST

CM YS Jagan : పేలిన మాటల తూటాలు.. జగన్ ఆన్ ది ఫైర్..!

CM YS Jagan :

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వైసీపీలో ఉత్సాహం రెట్టింపు అవుతోంది. ఎందుకంటే మొన్నటి వరకు జగన్ రాక ముందే ప్రజల్లో తమదే బలం అని ప్రతిపక్ష పార్టీలు అయిన టీడీపీ, జనసేనలు రెచ్చిపోయాయి. కానీ అసలు జనంలో ఎవరికి పట్టు ఉందో ఇప్పుడు జగన్ వస్తే గానీ ఎవరికీ అర్థం కాలేదు. జగన్ పెడుతున్న సిద్ధం సభలు జనసంద్రంలా మారుతున్నాయి. నిన్న మూడో సభను ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రాప్తాడులో జగన్ నిర్వహించారు. అంతకు ముందు పెట్టిన రెండు సభల కంటే ఇది మరింత సక్సెస్అ యిపోయింది. పైగా పెట్టింది సీమలో కాబట్టి ఆ ప్రభావం సభలో బలంగా కనిపించింది.

రెట్టింపు ఉత్సాహంతో ఏపీ ప్రజలు ఈ సభకు వచ్చారు. జగన్ సిద్ధమా అని నినాదం ఇచ్చినప్పుడల్లా సిద్దమే అంటూ రీసౌండ్ వచ్చేలా జనాల అరుపులు చూస్తుంటే సభ ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సభలో జగన్ ప్రసంగం మాటల తూటాలను పేల్చింది. ఆయన సామాన్య జనాలకు అర్థం అయ్యే విధంగా వచ్చే ఎన్నికలు ఎవరెవరికి మధ్య జరుగుతుందో వివరించారు. ఇటు వైపు ఈ పథకాలు ఇలాగే కొనసాగాలని భావిస్తున్న మనకు.. అటువైపు ఆ పథకాలను అడ్డుకునే చంద్రబాబుకు మధ్య ఈ యుద్ధం జరుగుతోంది. అంతే కాకుండా పేదలకు, పెత్తం దారులకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.

విశ్వసనీయ, వంచన అనే పదాలకు మద్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇచ్చిన మాట మీద నిలబడే వైసీపీకి.. నమ్మించి మోసం చేసే టీడీపీకి మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయి అంటూ ఆయన క్లియర్ గా వివరించే ప్రయత్నాలు చేశారు. అంతే కాకుండా 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు హయాంలో.. చిన్న పిల్లలు గానీ.. ముసలి వారు గానీ,, ఆడపడుచులు గానీ చెప్పుకునే పథకం ఒక్కటైనా ఉందా అంటూ ప్రశ్నించారు జగన్. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే తాను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని.. కచ్చితంగా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానంటూ చెబుతున్నారు సీఎం జగన్.

CM YS Jagan Public Meeting At Raptadu

CM YS Jagan Public Meeting At Raptadu

ఇలా సామాన్య జనాలకు సైతం అర్థం అయ్యే విధంగా జగన్ తన ప్రసంగాన్ని సాగించారు. అంతే కాకుండా ఏదో మాటల గారడీ చెప్పి ఓట్లు అడగకుండా ప్రజలకు చేసిన మంచి పనులను చూపించి మాత్రమే ఓట్లు అడుగుతున్నారు. ఇలా చేయడం వల్ల ఆయన మీద ప్రజలకు విశ్వసనీయత మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.

అవి వచ్చే ఎన్నికల్లో ఓట్ల రూపంలో కురిసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. జగన్ మీద టీడీపీ, జనసేన ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా.. జగన్ సభలు సక్సెస్ అవుతున్నాయంటే.. ఆయన మీద ప్రజలకు ఉన్న నమ్మకం ఎలాంటిదో అర్థం చేసుకోవాలంటూ కోరుతున్నారు వైసీపీ నేతలు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News