Pawan Kalyan : పవన్ కల్యాణ్‌ ఎక్కడ.. కూటమి గెలుపుపై నమ్మకం లేదా..?

Qubetvnews - May 19, 2024 / 04:45 PM IST

Pawan Kalyan : పవన్ కల్యాణ్‌ ఎక్కడ.. కూటమి గెలుపుపై నమ్మకం లేదా..?

Pawan Kalyan : ఏపీలో ఎన్నో రభసల మధ్య పోలింగ్ పూర్తయింది. అయితే పోలింగ్ సరళిని చూస్తే ఒక్కో పార్టీ ఒక్కో విధంగా ఆలోచిస్తోంది. గతంతో పోలిస్తే ఈ సారి 2 శాతం పోలింగ్ ఎక్కువగా నమోదైంది. దాంతో ఈ పెరిగిన పోలింగ్ ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనేది మాత్రం అర్థం కావట్లేదు. కాగా గెలుపుపై వైసీపీలో కనిపిస్తున్న ధీమా అటు కూటమిలో కనిపించట్లేదు. పోలింగ్ పూర్తయిన తర్వాత ఒక్క జగన్ మాత్రమే ఎన్నికల ఫలితాలపై స్పందించారు. గతం కంటే ఎక్కువ సీట్లు సాధిస్తున్నామని చెప్పారు. రెండోసారి వైసీపీ అధికారంలోకి రాబోతోందని నమ్మకంతో చెప్పుకొచ్చారు సీఎం జగన్.

అయితే జగన్ లో కనిపించిన కాన్ఫిడెన్స్ ప్రతిపక్షాల పార్టీల అధ్యక్షుల్లో కనిపించట్లేదు. ఇప్పటి వరకు పోలింగ్ సరళి మీద అటు చంద్రబాబు గానీ, పవన్ కల్యాణ్‌ గానీ స్పందించట్లేదు. ఇక పవన్ కల్యాణ్‌ అయితే అసలు ఎక్కడ ఉన్నాడో కూడా ఎవరికీ తెలియట్లేదు. పోలింగ్ పూర్తయిన తర్వాత ఒక్కసారి స్పందించారు. తనకు సహకరించిన వర్మకు థాంక్స్ చెప్పారు. అంతే తప్ప ఈ ఎన్నికల్లో కూటమి గెలుస్తుందా లేదా అనే విషయంపై ఆయన అస్సలు స్పందించలేదు. ఆయన ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు. అటు జనసైనికులకు కూడా ఈ విషయం మీద క్లారిటీ లేదు.

దాంతో ఇప్పుడు పవన్ కల్యాణ్‌ ఎక్కడ అంటూ కొందరు అడుగుతున్నారు. కొందరేమో పవన్ కల్యాణ్‌ అత్తగారి దేశం రష్యాకు వెళ్లిపోయాడు అంటున్నారు. ఇంకొందరేమో పవన్ కల్యాణ్‌ విదేశాలకు వెళ్లిపోయాడని చెబుతున్నారు. మరి ఎల్లో మీడియా, టీడీపీ బ్యాచ్ రాసుకొస్తున్నట్టు టీడీపీ కూటమి నిజంగానే గెలుస్తుంది అనుకుంటే పవన్ కల్యాణ్‌ గానీ, చంద్రబాబు గానీ దానిపై ఈ పాటికి స్పందించాల్సింది కదా. కానీ ఎవరూ స్పందించట్లేదు. జూన్ 4న ఫలితాలు వెలువడుతున్నాయి. అప్పటి వరకు వీరిలో మౌనం కంటిన్యూ అయ్యేలా కనిపిస్తోంది. ఎందుకంటే పవన్ కల్యాణ్‌ కు ఫలితాలపై గట్టి సమాచారం ఉన్నట్టు తెలుస్తోంది.

ఎలాగూ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు పెద్దగా లేవని.. కాబట్టి ఇలాంటి సమయంలో తాను స్పందించి చులకన అయ్యే కంటే కూడా ఫలితాలు వచ్చే వరకు వెయిట్ చేయడమే బెటర్ అని ఆయన అనుకుంటున్నారు. అందుకే ఇప్పుడు ఆయన బయటకు రావట్లేదని తెలుస్తోంది.

కానీ కనీసం ఆయన ఎక్కడున్నాడో కూడా ఎవరికీ తెలియట్లేదంటేనే ఇప్పుడు అందరికీ అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే జగన్, చంద్రబాబు ఎక్కడున్నారో అందరికీ తెలుసు. కానీ పవన్ కల్యాణ్‌ ఎక్కడున్నాడో ఎవరికీ ఎవరికీ తెలియట్లేదంటే చాలా రకాలు అనుమానాలు తెరమీదకు వస్తున్నాయి.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News