Rajesh Mahasena withdraws from contest : కులరక్కసికి బలైపోయా.. పోటీ నుంచి తప్పుకున్న మహాసేన రాజేశ్..!
Qubetvnews - March 2, 2024 / 01:38 PM IST
Rajesh Mahasena withdraws from contest : టీడీపీలో ఇప్పుడు కల్లోలం స్టార్ట్ అయింది. సీట్లు ప్రకటించిన చాలా చోట్ల అంసతృప్త జ్వాలలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల అల్లర్లు జరుగుతుండగా.. ఇప్పుడు పి.గన్నవరం అభ్యర్థి మహాసేన రాజేశ్ సంచలన ప్రకటన చేశారు. తాను ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపారు. టీడీపీ నుంచి పి.గన్నవరం అభ్యర్థిగా ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గానికి టికెట్ కేటాయించారు చంద్రబాబు నాయుడు.
అయితే తాజాగా రాజేశ్ మహాసేన పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. తాను కులరక్కసికి బలైపోయానని.. తనలాంటి సామాన్యుడికి టికెట్ రాగానే వ్యవస్థ మొత్తం ఏకమైపోయి తనను తప్పించందన్నారు. ఈ విషయంలో పార్టీని గానీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ను ఏమీ అనొద్దంటూ ఆయన కోరారు.
అయితే రాజేశ్ ను పి.గన్నవరం అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి టీడీపీ లోకల్ లీడర్లు వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. నేరుగా చెప్పకపోయినా.. రాజేశ్ హిందువులపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలకు ఆయన తప్పుకోవాలని సోషల్ మీడియాలో కొన్ని డిమాండ్లు అయితే వచ్చాయి.
కానీ రాజేశ్ మాత్రం తాను కులరక్కసికి బలైపోయానంటూ పోస్టులో చెప్పడమే ఇప్పుడు సంచలనం రేపుతోంది. మరి రాజేశ్ తప్పుకోవడానికి కారణాలు పూర్తిగా తెలియదు. ఏదేమైనా టీడీపీలో మొదటి వికెట్ ఔట్ అయింది. మరి ఇప్పుడే ఇలా ఉంటే.. ఇంక ముందు ముందు ఇంక ఎన్ని సీట్లలో ఇలాంటి కుమ్ములాటలు వస్తాయో చూడాలి.





