Rk Roja : నగరిలో రోజా గెలుపు ఖాయమే.. పెరిగిన ఓటింగ్ వైసీపీకేనా..?

Qubetvnews - May 14, 2024 / 08:03 PM IST

Rk Roja : నగరిలో రోజా గెలుపు ఖాయమే.. పెరిగిన ఓటింగ్ వైసీపీకేనా..?

Rk Roja : ఏపీలో ఎక్కువగా నగరి నియోజకవర్గం మీదనే సర్వత్రా చర్చ జరిగింది. ఎందుకంటే వైసీపీ ఫైర్ బ్రాండ్ అయిన రోజా జగన్ ను ఎవరేం అన్నా సరే చాలా దూకుడా వ్యవహరిస్తూ వస్తుంటారు. అలాంటి ఆమె చాలా కాలంగా నగరిలో ఓడిపోతుంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మరీ ముఖ్యంగా వైసీపీలోనే అసమ్మతి నేతలు రోజాను ఓడిస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ ఎన్నికల్లో ఆమె ప్రత్యర్థిగా టీడీపీ తరఫున గాలి భాను ప్రకాశ్ తలబడ్డారు. గత ఎన్నికల్లో కూడా ఇలాగే రోజా ఓడిపోతారంటూ ప్రచారం చేశారు. కానీ ఆ ఎన్నికల్లో భాను ప్రకాశ్ ను ఓడించారు రోజా.

2014లో గాలి ముద్దు కృష్ణుమనాయుడును ఓడించి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక రెండో సారి ఆమె గెలవడంతో పాటు వైసీపీ గెలవడంతో ఆమెకు మంత్రి పదవి ఖాయం అనుకున్నారు. మొదటి దఫాలో రాలేదు గానీ.. రెండో దఫాలో మాత్రం వచ్చింది. అయితే ఆమె మంత్రి అయినప్పటి నుంచే ఆమెకు సొంత నియోజకవర్గంలో కష్టాలు మొదలయ్యాయి. వైసీపీలోనే అసమ్మతి నేతలతో ఆమె నిత్యం పోరాడాల్సి వచ్చింది. రాష్ట్రంలో ప్రత్యర్థుల కంటే సొంత నియోజకవర్గంలో వైసీపీ అసమ్మతి నేతలే ఎక్కువగా ఆమెను ఇబ్బంది పెట్టారు. ఇంకా చెప్పాలంటే కొందరు రెబల్స్ గా దిగారు.

ఇంకొందరు అయితే టీడీపీలోకి వెళ్లి భానుప్రకాశ్ గెలుపుకోసం పని చేశారు. దాంతో రోజా పని అయిపోయింది అంటూ పెద్ద ఎత్తున ఓ ప్రచారం లేచింది. కానీ రోజాకు కూడా కొన్ని చివరి రోజుల్లో కలిసి వచ్చాయి. టీడీపీలో అసంతృప్తిగా ఉన్న అశోక్ రాజు లాంటి వారు వైసీపీలోకి రావడం ఆమెకు కలిసి వచ్చింది. దాంతో పాటు భానుప్రకాశ్ తల్లి, సోదరుడి సహకారం కూడా రోజాకు సీక్రెట్ గా ఉందని అంటున్నారు. ఇక దానికి తోడు నగరిలో దాదాపు 82 శాతం పోలింగ్ నమోదైంది. ఈ పెరిగిన ఓటింగ్ అంతా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు, పిన్షన్లు తీసుకునే వారు, రైతులే ఎక్కువగా ఉన్నారు.

వీరంతా జగన్ ఐదేండ్ల పాలనలో బాగా లబ్ది పొందిన వారే. మొదటి నుంచి రైతులు, మహిళలు వైసీపీకే మద్దతు తెలుపుతూ వస్తున్నారు. ఈ సారి నగరిలో ఓటింగ్ కూడా వారిదే అధికంగా నమోదైంది. దాంతో వారంతా కచ్చితంగా రోజాకే ఓటు వేశారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ పెరిగిన ఓటింగ్ మొత్తం రోజాకే పడిందని అంటున్నారు.

దాంతో ఇప్పుడు నగరిలో టీడీపీ సైలెంట్ అయిపోయింది. మొన్నటి వరకు రోజా ఓడిపోతుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసిన వారే.. ఇప్పుడు స్వల్ప మెజార్టీతో రోజా గెలుస్తుందని అంటున్నారు. దాంతో నగరిలో సీన్ మారిపోయింది. మూడోసారి రోజా గెలిచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News