Chandrababu : చంద్రబాబు, పవన్ మధ్య సైలెంట్ గ్యాప్.. అయోమయంలో కూటమి..!
Qubetvnews - July 19, 2024 / 12:00 PM IST
Chandrababu : కలిసి ఉంటే కలదు లాభం అనేది రాజకీయాల్లో పనికొచ్చే మాట. అదే విషయాన్ని ఏపీ కూమికి బాగా ఆపాదించాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ, జనసేన విడిగా ఉన్నప్పుడు పెద్దగా కలిసి రాలేదు. కానీ ఎప్పుడైతే కూటమిగా ఏర్పడ్డారో అప్పుడే భారీగా క్రేజ్ పెరిగింది. దాంతో ఆ క్రేజ్ ను వారు భారీగా వాడుకున్నారు. ఆ విధంగా కష్టపడి వారు అధికారంలోకి వచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట్లో బాగానే కలిసి పనిచేశారు. కానీ ఇప్పుడు చంద్రబాబు, పవన్ ఒక 20 రోజులుగా కలుసుకోవట్లేదు. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండొచ్చు గాక.
కానీ ఇప్పుడు వారు ఢిల్లీకి వెళ్తున్న టూర్ మాత్రం చాలా భిన్నంగా ఉంది. చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి మొన్న కేంద్రమంత్రులను కలిశారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలిసి ఏపీ రాష్ట్ర సమస్యలపై, రావాల్సిన నిధులు, ఇతర ప్రాజెక్టులపై మాట్లాడారు. అయితే చంద్రబాబు వెళ్లినప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను వెంట పెట్టుకుని వెళ్లలేకపోయాడు. అదే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని చూస్తే ఒక విషయం అర్థం అవుతుంది. అదేంటంటే.. రేవంత్ రెడ్డి సీఎంగా ఉండి అందరినీ కలుపుకునిపోతున్నారు. ఆయన ఢిల్లీ వెళ్లినప్పుడల్లా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను వెంట పెట్టుకుని వెళ్తున్నారు.
కానీ చంద్రబాబు మాత్రం అలా పవన్ ను వెంట పెట్టుకుని వెళ్లట్లేదు. ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా డిప్యూటీ సీఎం హోదాలో ఢిల్లీకి వెళ్తున్నారు. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన జలజీవన్ మిషన్ రివ్యూ భేటీ ఉంది. పంచాయితీ రాజ్.. గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రిగా పవన్ హాజరవుతున్నారు. ఇంటింటికీ రక్షిత మంచినీరు అందించాలన్న ఉద్దేశంతో కేంద్రం తీసుకొచ్చిన ఈ కార్యక్రమాన్ని.. క్షేత్ర స్థాయిలో ఎలా అమలవుతుందన్నది కేంద్రం ఆలోచన. అయితే పవన్, చంద్రబాబు ఇలా విడిగా వెళ్తే మాత్రం దాన్ని మీడియా రకరకాలుగా వండి వడ్డిస్తుంది.
ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందని.. కూటమి ప్రభుత్వంలో లుకలుకలు అని రకరకాలుగా ప్రచారం చేస్తుంది. దాంతో కూటమి నేతల్లో ఆందోళన, అలజడి మొదలవుతాయి. కాబట్టి ఇలాంటి వాతావరణానికి అవకాశం ఇవ్వకుండా పవన్ కల్యాణ్, చంద్రబాబు ఎక్కడకు వెళ్లినా.. ఎలాంటి ప్రకటనలు చేసినా ఉమ్మడిగా చేస్తేనే బెటర్ అని అంటున్నారు.





