Chandrababu : చంద్రబాబుపై మమకారం.. జగన్ పై వెటకారం.. రాళ్లదాడి కనిపించట్లేదా..?

Qubetvnews - April 15, 2024 / 12:14 PM IST

Chandrababu : చంద్రబాబుపై మమకారం.. జగన్ పై వెటకారం.. రాళ్లదాడి కనిపించట్లేదా..?

Chandrababu : ప్రజాస్వామ్య దేశంలో రాళ్ల దాడిని ఎవరూ ఒప్పుకోరు. అది కూడా ఒక పార్టీ అధ్యక్షుడు, సీఎంగా ఉన్న వ్యక్తిపై రాళ్ల దాడిని ప్రజాస్వామ్య బద్దంగా అందరూ ఖండించాల్సిందే. పార్టీలతో సంబంధం లేకుండా ఇలాంటి దాడులను వ్యతిరేకించినప్పుడే ప్రజాస్వామ్యం మనుగడ సాధ్యం అవుతుంది. కానీ ఈ విషయం టీడీపీ బ్యాచ్ కు గానీ, ఎల్లోమీడియాకు గానీ అర్థం కావట్లేదేమో. అందుకే చంద్రబాబుకు చీమ కుట్టినా దేశమే మునిగిపోయినట్టు గగ్గోలు పెట్టేసి.. ఇప్పుడు జగన్ మీద ఇంత పెద్ద దాడి జరిగినా సరే మౌనంగానే ఉండిపోయింది. పైగా జగన్ మీద వెటకారాలు నూరుతోంది.

అప్పట్లో చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లారు. ఆ సమయంలో ఎల్లో మీడియా చేసిన రాద్దాంతం అంతా ఇంతా కాదు. చంద్రబాబు గదిలో ఫ్యాన్ తిరగట్లేదని ఆయనకు దోమలు కుట్టి చనిపోయేలా కుట్ర చేస్తున్నారంటూ లేనిపోని కథనాలు రాశాయి టీడీపీ పత్రికలు. చంద్రబాబు గదిలో కావాలనే ఫ్యాన్ పెట్టలేదని.. కావాల్సిన సదుపాయాలు లేవని.. దోమలు కుట్టి ఆయనకు డెంగ్యూ వ్యాధి వచ్చి చనిపోయేలా మర్డర్ ప్లాన్ చేస్తున్నారంటూ ఇలా ఒక్కటేమిటి ఏమేం రాయాలో అన్నీ రాసేశారు. ఓ సమయంలో లోకేష్ డ్రోన్ తిరుగుతోంది అంటూ ఆరోపించారు.

జైల్ చుట్టూ డ్రోన్ తిరుగుతోందని.. చంద్రబాబును జైల్లోనే చంపేసేందుకు కుట్రలు చేస్తున్నారంటూ చెప్పడంతో ఎల్లో మీడియాలో కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ చంద్రబాబుపై ఎలాంటి అటాక్ జరగలేదు. కనీసం దోమలు కూడా కుట్టలేదు. ఏమీ జరగని దానికే అంత హడావిడి చేసి రాష్ట్రమే తగలబడిపోతున్నంత హైరానా చేసిన ఎల్లో మీడియా.. ఇవాళ జగన్ మీదదాడిని మాత్రం ఎందుకు ఖండించలేకపోతోంది. ప్రజాస్వామ్యంలో మీడియా చాలా కీలకం. ఒక సీఎం మీద దాడిని ఖండించినప్పుడే కదా ఆ మీడియా మీద అందరికీ నమ్మకం కలుగుతుంది.

కానీ అలా చేయకపోగా జగన్ అక్కడికేదో కావాలనే దాడి చేయించుకున్నారంటూ వార్తలు రాయడం వెనకాల అర్థం ఏంటో వారే చెప్పాలి. జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉండగా రాళ్ల దాడి ఎలా జరిగిందంటూ లేనిపోని బీరాలు తీస్తోంది ఎల్లో మీడియా. అంటే మొత్తానికి జగన్ మీద దాడిని కూడా వెటకారంగా చూస్తోందని వైసీపీ విమర్శలు చేస్తోంది.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News