Ys Jagan : జగన్ మీద ఇంకా విషం కక్కుతున్న ఎల్లో మీడియా.. ఇక ఆపరా..?

Qubetvnews - May 13, 2024 / 07:03 PM IST

Ys Jagan : జగన్ మీద ఇంకా విషం కక్కుతున్న ఎల్లో మీడియా.. ఇక ఆపరా..?

Ys Jagan : చంద్రబాబు నాయుడు తానా అంటే ఎల్లో మీడియా మొత్తం తందానా అంటుందనేది వైసీపీ మొదటి నుంచి చేస్తున్న ఆరోపణ. అందుకు తగ్గట్టే ఆ మీడియా సైతం మెదులుకుంటోంది. ఇప్పటికే చాలా విషయాల్లో చంద్రబాబు ఏది చెబితే దాన్ని గుడ్డిగా రాసేస్తూ వస్తోంది ఎల్లో మీడియా. మరీ ముఖ్యంగా ఈ ఐదేండ్లుగా జగన్ మీద ఎంత దుష్ప్రచారం చేయాలో అంతగా చేసేశారు. జగన్ మీద ఎన్ని ఫేక్ న్యూస్ లు రాయాలో అంత రాసేశారు. ఒక రకంగా చెప్పాలంటే జర్నలిజం అనే ముసుగును తీసేసి మరీ బట్టలు లేకుండా చంద్రబాబు భజన చేసేశాయి ఎల్లో మీడియా సంస్థలు అని వైసీపీ ఇప్పటికీ చెబుతూనే ఉంది.

ఒక రకంగా ఈ ఐదేండ్లుగా చంద్రబాబు ఎన్ని అబద్దాలు చెబితే వాటిని నిజమే అంటూ ప్రచారం చేశాయి. జగన్ సిద్ధం సభలకు లక్షలాది మంది జనాలు వస్తే అసలు జనాలే రాలేదంటూ రాసుకొచ్చాయి. రాప్తాడు సభకు జనసంద్రం తరలివస్తే.. సభ ఫెయిల్ అయిందంటూ రాసుకొచ్చారు. దాంతో పాటు ఇప్పటి వరకు జగన్ చేసిన అప్పులు దేశంలో ఎవరూ చేయలేదంటూ రాసుకొచ్చారు. ఒక రకంగా అసలు చంద్రబాబు అప్పులే చేయలేదన్న రేంజ్ లో చెప్పుకొచ్చాయి ఆ మీడియా. ఇక బూం బూం బీర్లు అంటూ కల్తీ మద్యం అంటూ ఎన్నో వార్తలు రాసుకొచ్చాయి.

కానీ చంద్రబాబు హయాంలో జరిగిన సారాయి వ్యాపార అరాచకాలను మాత్రం మర్చిపోయాయి. వాలంటీర్ల వ్యవస్థను పెడితే.. ఆడవారి పాలిట రాక్షసులు అంటూ వారిపై విషం చిమ్మారు. చివరకు చంద్రబాబు అదే వాలంటీర్లను కొనసాగిస్తామంటూ శభాష్‌ అంటూ రాసుకొచ్చాయి. ఇంగ్లిష్ మీడియం పెడితే అది ఏపీ ప్రజలను సర్వనాశనం చేస్తుంది అన్న రేంజ్ లో విషం చిమ్మారు. చివరకు అదే ఇంగ్లిష్ పిల్లలు మాట్లాడుతుంటే నోరెత్తట్లేదు. ఇక చాలా రోజుల తర్వాత ఎన్నికల సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఎంత రాశారో.. ఎంత చెప్పారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఒకప్పుడు ఇదే ఎల్లో మీడియా సంస్థలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భేష్ అంటూ పొగిడాయి. కానీ ఇప్పుడు అదే మీడియా సంస్థలు అది జగన్ తెచ్చిన అరాచక చట్టాలు.. పేదల భూములు లాక్కోవడానికి తీసుకొచ్చారు అంటూ లేనిపోని కథనాలు రాసారు. ఇక జగన్ తన తల్లిని, చెల్లికి అన్యాయం చేశారంటూ రాశారు.

కానీ అదే చంద్రబాబు తన మామను చెప్పులతో కొట్టించి, పార్టీని లాక్కుంటే మాత్రం ఇప్పటి వరకు కిమ్మనలేదు. ఇలా ఎన్నో విషయాల్లో చంద్రబాబు తప్పులను కప్పిపుచ్చి.. జగన్ మీద మాత్రం లేనిపోనివన్నీ రాశారు. కానీ బలమైన సోషల్ మీడియా ఎప్పటికప్పుడు ఎల్లో మీడియాకు గట్టి కౌంటర్లు ఇస్తూనే వచ్చింది. చివరకు జగన్ ను ప్రజల్లో నిజాయితీపరుడిగా నిలబెట్టిందని వైసీపీ స్పష్టం చేస్తోంది.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News