Jr Ntr : జూనియర్ ఎన్టీఆర్ పై ఎల్లో మీడియా కక్ష.. అతనికోసమే..?
Qubetvnews - May 29, 2024 / 10:21 AM IST
Jr Ntr : చంద్రబాబు నాయుడు కళ్లలో ఆనందం చూడటం కోసం ఎల్లో మీడియా ఎంతకైనా తెగిస్తుంది అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక చంద్రబాబు వ్యూహంలో భాగంగా ఎవరినైనా టార్గెట్ చేసేస్తుంది ఎల్లో మీడియా. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మీద పడిందని తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ పేరు బాగా ట్రెండింగ్ లో ఉంటుంది. ఎందుకంటే లోకేష్ కు టీడీపీ పట్టాభిషేకం చేస్తారని అంటున్నారు. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ పేరు బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే మొదటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ కు పార్టీ పగ్గాలు ఇవ్వాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.
టీడీపీని ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే సమర్థవంతంగా నడిపించగలడని అంటున్నారు. కాబట్టి ఆయనకు పార్టీ పగ్గాలు ఇవ్వాలనే డిమాండ్ అటు పార్టీ శ్రేణుల నుంచి కూడా వస్తోంది. అయితే చంద్రబాబు తన వారసుడికి తప్ప వేరే వారికి పార్టీని ఇచ్చే ఆలోచన చేయరు. అందుకే ఇప్పుడు లోకేష్ పేరు బలంగా వినిపిస్తోంది. కానీ లోకేష్ కు పోటీగా జూనియర్ ఎన్టీఆర్ రాకుండా ఉండేందుకు ఇప్పటి నుంచే ఆయన్ను సైడ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే టీడీపీ నేతలు జూనియర్ ఎన్టీఆర్ కు పార్టీకి సంబంధం లేదని అంటున్నారు.
అటు ఎల్లో మీడియాలో కూడా జూనియర్ ను సైడ్ చేసే పని సక్రమంగా సాగుతోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫొటో వేయడానికి కూడా ఎల్లో మీడియా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. తాజాగా సీనియర్ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్, ఆయన సోదరుడు కల్యాణ్ రామ్ ఇద్దరూ కలిసి నివాళి అర్పించారు. అయితే వీరిద్దరు నివాళి అర్పించిన న్యూస్ ఎల్లో మీడియాలో ఎక్కడా కనిపించలేదు. కనీసం ఒక్క ఫొటో వేయడానికి కూడా వారు ఇంట్రెస్ట్ చూపించలేదు. బాలకృష్ణ, పురంధేశ్వరి, ఆయన భర్తను మాత్రం హైలెట్ చేశారు.
అంతే తప్ప ఎక్కడ కూడా జూనియర్ పేరు గానీ, ఫొటో గానీ వేయలేదు. ఇదంతా చంద్రమాయ గానే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు చంద్రబాబుకు పట్టాభిషేకం చేయడంలో పాలు పంచుకున్న బాలకృష్ణ, దగ్గుబాటి కుటుంబానికి ఇప్పుడు ప్రాధాన్యత కల్పించారు. అంతే తప్ప జూనియర్ ను మాత్రం పట్టించుకోలేదు.
మరి జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కూడా ఆయన వారసులే కదా. వారిని మాత్రం ఎందుకు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే అంతా చంద్రబాబు కండ్లలో ఆనందం కోసమే అని అంటున్నారు. ఇలా జూనియర్ ను సైడ్ చేసేసి లోకేష్ కు లైన్ క్లియర్ చేసే పనిని శరవేగంగా జరుపుతోంది ఎల్లో మీడియా మొత్తం.





