Pawan kalyan- Lokesh : పిఠాపురం లో పవన్ మంగళగిరిలో లోకేష్.. ప్రచారం లేకుండా గెలిచే దమ్ముందా?

Qubetvnews - March 20, 2024 / 12:29 PM IST

Pawan kalyan- Lokesh : పిఠాపురం లో పవన్ మంగళగిరిలో లోకేష్.. ప్రచారం లేకుండా గెలిచే దమ్ముందా?

Pawan kalyan- Lokesh : పవన్ కల్యాణ్‌, లోకేష్ కు ఈ ఎన్నికలు అందరికంటే చాలా కీలకం. ఎందుకంటే వారు గనక ఈ సారి గెలవకపోతే వారికి రాజకీయ భవిష్యత్ ఇక దాదాపు శూన్యం అనే చెప్పుకోవాలి. పవన్ కల్యాణ్‌ జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు. లోకేష్ ఇటు టీడీపీ భవిష్యత్ సారథిగా చెప్పుకుంటున్నాడు. కాబట్టి ఎటు చూసినా ఈ ఇద్దరూ రెండు పార్టీలకు చాలా కీలకం. ఇంకా చెప్పాలంటే రాష్ట్ర రాజకీయాల్లో ఈ ఇద్దరూ పెద్ద పొజీషన్ లో ఉండే ఆస్కారం ఉన్న నాయకులు. కానీ ఏం లాభం.. ఇప్పుడు ఈ ఇద్దరికీ రాజకీయ జీవన్మరణ సమస్యగా మారిపోయాయి ఈ ఎన్నికలు.

గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌ రెండు చోట్ల నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. అదే ఎన్నికల్లో లోకేష్ కూడా మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. వీరిద్దరూ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం గత ఎన్నికల్లోనే మొదటిసారి. మొదటిసారే ఇద్దరూ ఓడిపోయి అంచనాలను తలకిందులు చేశారు. ఈ ఎన్నికల్లో కూడా లోకేష్ మంగళగిరి నుంచే పోటీ చేస్తున్నాడు. కానీ పవన్ కల్యాణ్‌ మాత్రం గతంలో పోటీ చేసిన భీమవరం, గాజువాకను పక్కన పెట్టి పిఠాపురంకు షిఫ్ట్ అయ్యాడు. ఈ ఎన్నికల్లో ఆయన ఒకే నియోజకవర్గాన్ని నమ్ముకుంటున్నాడు. దాంతో ఈ ఇద్దరికీ ఇప్పుడు ఈ ఎన్నికలు పెద్ద సవాల్ నే విసురుతున్నాయి.

అయితే ఈ ఇద్దరూ ఇప్పుడు తమ నియోజకవర్గాలకే పరిమితం అవుతారని ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఇతర నియోజకవర్గాల్లో తిరిగితే ఓడిపోతామనే భయం వారిలో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఈ ఎన్నికల్లో తమ నియోజకవర్గాల్లోనే బలంగా ప్రచారం చేసుకోవాలని చూస్తున్నారంట. ఈ విషయంపై వైసీపీ ఓ సవాల్ విసురుతోంది. జగన్ తన నియోజకవర్గం అయిన పులివెందులలో ప్రచారం చేయకున్నా గెలుస్తారని.. పవన్ కల్యాణ్‌ కు, లోకేష్ కు దమ్ముంటే తమ నియోజకవర్గాల్లో ప్రచారం చేయకుండా గెలిచి చూపించాలని డిమాండ్ చేస్తోంది వైసీపీ.

మొన్నటి వరకు కేవలం తాము నామినేషన్ వేస్తే చాలు ప్రజలే గెలిపిస్తారని చెప్పిన పవన్, లోకేష్ లు.. ఇప్పుడు ఆ మాట మీద నిలబడి చూపించాలని సవాల్ విసురుతున్నారు వైసీపీ నేతలు. రాబోయే ఎన్నికల్లో ప్రచారం చేయకుండా గెలిచే సత్తా ఉంటే చూపించాలని సవాల్ విసురుతున్నారు.

అప్పుడే మీకు ప్రజల్లో పట్టు ఉందని నమ్ముతామని చెబుతున్నారు. మరి పనవ్ కల్యాణ్, లోకేష్ అంటే చిన్న నాయకులు కాదు కదా.. పార్టీలకు సారథులుగా చెప్పుకుంటున్న లీడర్లు. కాబట్టి జగన్ లాగానే వారు కూడా ప్రచారం చేయకుండా గెలవాలని అంటున్నారు. చూడాలి మరి పవన్, లోకేష్ ఏం చేస్తారో.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News