Poling Day : పోలింగ్ బూతుల వద్ద మహిళలు, వృద్ధుల క్యూ.. కూటమిలో భయం..!
Qubetvnews - May 13, 2024 / 02:39 PM IST
Poling Day : ఏపీలో ఎన్నికల ప్రచార సమరం ముగిసింది. ఈ రోజు ప్రజల చేతుల్లోనే అంతా ఉంది. వారు ఎటువైపు ఓటేస్తే వారిదే పీఠం. ఇన్ని రోజులు ప్రజలకు ఎంత చెప్పాలో ఏం చెప్పాలో అన్ని చెప్పేశాయి పార్టీలు. జగన్ చేసింది, చేయబోయేది మాత్రమే చెప్పారు. కానీ చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాత్రం అరచేతిలో ఆకాశాన్ని చూపించి ఇది చేస్తాం, అది చేస్తాం.. జగన్ ఇలాంటోడు.. అలాంటోడు అని లేనిపోని చెడు ప్రచారాలు చేశారు. కానీ ఎవరెన్ని చేసినా మాత్రం ఈ రోజు ప్రజలు ఎవరికి ఓటేస్తే వారిదే పీఠం అని అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఓట్లేయడానికి వస్తున్న వారిని చూసి టీడీపీ కూటమిలో భయం పెరుగుతోంది.
ఎందుకంటే ఏ పోలింగ్ బూత్ వద్ద చూసినా సరే ఎక్కువగా పిన్షన్లు తీసుకునే వృద్ధులు, వికలాంగులతో పాటు మహిళా ఓటర్లు బాగా కనిపిస్తున్నారు. దాంతో ఓటింగ్ లో ఎక్కువ శాతం వారిదే ఉండేలా కనిపిస్తోంది. ఇది చూసిన వారంతా షాక్ అవుతున్నారు. ఎందుకంటే వీరంతా జగన్ పాలనలో బాగా లబ్దిపొందిన వారే. పిన్షనర్లు, మహిళా ఓటర్లు చంద్రబాబు పాలనలో బాగానే ఇబ్బందులు పడ్డారు. కానీ జగన్ పాలనలో మాత్రం పిన్షనర్లకు వాలంటీర్లు ఇంటివద్దకే వచ్చి పింఛన్లు ఇచ్చి వెళ్లడాన్ని మనం చూశాం. అంతే కాకుండా జగన్ పథకాల వల్ల లబ్ది పొందింది కూడా మహిళా ఓటర్లే.
అందుకే వారిలో జగన్ మీద ఎక్కువగా నమ్మకం ఉంది. కాగా వీరు రీసెంట్ గా చంద్రబాబు చేష్టల వల్ల తీవ్రంగా నష్టపోయారు. వాలంటీర్లతో ఎన్నికల సమయంలో పిన్షన్లు ఇంటికి వెళ్లి ఇవ్వొద్దు అంటూ చంద్రబాబు తన అనునాయులతో ఈసికి ఫిర్యాదులు చేయించి మరీ అడ్డుకున్నారు. దాంతో వాలంటీర్లు ఇవ్వలేక పిన్షన్లు తీసుకునే వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరు వృద్ధులు ఎండలో పిన్షన్లు తీసుకునేందుకు వెళ్లి చనిపోయిన ఘటనలు కూడా మనం చూశాం. దాంతో పిన్షన్లు తీసుకునే వారంతా చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
ఇక రీసెంట్ గా డీబీటీ ద్వారా లబ్ది పొందే మహిళలకు కూడా డబ్బులు వారి అకౌంట్లలో వేయొద్దంటూ చంద్రబాబు తన అనుచరులతో ఈసికి ఫిర్యాదులు చేయించి మరీ అడ్డుకున్నారు. డబ్బులు వారి అకౌంట్లలో వేయకుండా అడ్డుకోవడంతో వారు నష్టపోయారు. దాంతో వారు ఇప్పుడు చంద్రబాబుపై తీవ్ర కోపంతో ఉన్నారు.
ఇప్పుడు ఉదయం నుంచి పోలింగ్ బూత్ ల వద్ద వీరే కనిపిస్తుండటంతో చంద్రబాబు కూటమిలో భయం పెరుగుతోంది. ఎందుకంటే వారంతా గంప గుత్తగా వైసీపీకే ఓటేస్తారని వారు భావిస్తున్నారు. దాంతో తమ ఓటమి ఖాయం అయిపోయిందని ముందే డిసైడ్ అయిపోతున్నారంట.





