Ys Jagan : జగన్ ఈజ్ బ్యాక్.. పోరుబాట మొదలెట్టిన మాజీ సీఎం..
Qubetvnews - July 22, 2024 / 06:07 PM IST
Ys Jagan : మళ్లీ పాత జగన్ వచ్చేశాడు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా విరుచుకుపడేవాడో మనందరికీ తెలిసిందే. ఒక్కో మాట ఫైర్ లా ఉండేది. ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నాడు జగన్. మొన్నటి వరకు ఐదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆయనలో ఫైర్ కనిపించలేదు. బహుషా అధికారంలో ఉన్నాడు కాబట్టి.. ప్రభుత్వ బాధ్యతల్లో ఆయన బిజీగా ఉన్నారని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు. కాబట్టి ఎంత దూకుడుగా వ్యవహరించినా సరే ఇప్పుడు పెద్దగా ఎఫెక్ట్ పడదు. ఆ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని అంటున్నారు.
ఇక ఓడిపోయినప్పటి నుంచి మొన్నటి వరకు ఆయన కాస్త సైలెంట్ గా ఉన్నారు. కానీ వినుగొండలో రషీద్ ఖాన్ హత్యతో పాటు రాష్ట్రంలోని వైసీపీ నేతల మీద దాడులతో జగన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహానికి గురయ్యారు. వినుగొండకు వెళ్లి ఎంత పవర్ ఫుల్ గా మాట్లాడారో అందరికీ తెలిసిందే. ఇక తాజాగా ఆయన అసెంబ్లీకి వచ్చిన తీరు.. అక్కడ ఆయన ప్రవర్తించిన తీరు చూస్తుంటే అందరూ జగన్ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్లు పెట్టేస్తున్నారు. జగన్ తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల కండువాలు కప్పుకుని ప్లకార్డులతో నిరసన తెలిపారు. అయితే ఈ విషయంలో పోలీసులు కలగజేసుకున్నారు.
వారు వైసీపీ లీడర్ల చేతిలో ఉన్న ప్లకార్డులను తీసుకుని చింపేశారు. దాంతో జగన్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.ఇది ప్రజాస్వామ్యమని చెబుతూ రోజులు ఎపుడూ ఒకేలా ఉండవని కూడా హెచ్చరించారు. ప్లే కార్డులు తీసుకునే అధికారం ఎవరు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. పోలీసు టోపీ మీద ఉండే మూడు సింహాల గురించి కూడా జగన్ చెబుతూ ప్రజా స్వామ్యాన్ని రక్షించాలని కోరారు. జగన్ చాలా ఆవేశంతో మాట్లాడిన ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన వారంతా కూడా.. జగన్ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
జగన్ మోహన్ రెడ్డి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడో.. ఇప్పుడు మళ్లీ అలాగే కనిపిస్తున్నాడని చెబుతున్నారు. గత ఐదేండ్లు జగన్ లో ఇలాంటి ఫైర్ ను మిస్ అయ్యామని చెబుతున్నారు ఆయన అభిమానులు. జగన్ నుంచి కోరుకున్నది అదే అంటూ చెబుతున్నారు.





