Ys Jagan : నా చెల్లి చీటర్.. ఆస్తుల్లో వాటా ఇవ్వను.. ఎన్ సీఎల్ టీలో జగన్ పిటిషన్..!

Qubetvnews - October 23, 2024 / 09:34 AM IST

Ys Jagan : నా చెల్లి చీటర్.. ఆస్తుల్లో వాటా ఇవ్వను.. ఎన్ సీఎల్ టీలో జగన్ పిటిషన్..!

Ys Jagan : మాజీ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన చెల్లెలు షర్మిలకు ఆస్తుల్లో ఎలాంటి వాటాలు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ మేరకు జగన్, భారతి కలిసి విజయమ్మ, షర్మిలపై న్యాయ పోరాటానికి సిద్ధం అయ్యారు. ఇందులో భాగంగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో సెప్టెంబర్ 9న వీరు పిటిషన్ వేశారు. ఇందులో జగన్ స్పష్టంగా తన వివరణ ఇచ్చారు. తన చెల్లెలు షర్మిలకు గతంలో తాను సిస్టర్ అఫెక్షన్ తో వాటాలు ఇవ్వాలని అనుకున్నట్టు తెలిపారు. కానీ అప్పట్లో అనుకోని కారణాల వల్ల ఇవ్వలేకపోయానని.. కానీ ఇప్పుడున్న పరిస్థితులను వివరిస్తూ ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పారు.

అప్పట్లో తన చెల్లెలు అనే బంధం కారణంగా తాను వాటాలు ఇవ్వాలని అనుకున్నట్టు చెప్పారు. కానీ ఇప్పుడు ఆమె తనకు ప్రతిపక్షంగా మారిందని.. ఆమె వల్ల తాను ఇబ్బందులు పడుతున్నట్టు తెలిపారు. అంతే కాకుండా షర్మిల పేరు నేరుగా చెప్పకుండానే చీటర్ అనే పదాన్ని కూడా ఇందులో వాడారు జగన్. 2019లో షర్మిలకు వాటాలు ఇవ్వడం కోసం ఎమ్ వోయూ చేశామని.. కానీ అది కొన్ని రకాల కారణాల వల్ల పూర్తి చేయలేకపోయినట్టు చెప్పారు. కానీ ఇప్పుడు ఆమె తనకు పూర్తి విరుద్ధంగా ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లో వాటాలు తన చెల్లెలు షర్మిలకు, తల్లి విజయమ్మకు ఇవ్వనంటూ తెలిపారు.

తమ వల్లే కంపెనీ లాభాలు పెరిగి విస్తరించినట్టు జగన్, భారతి వివరించారు. కానీ ఆస్తుల్లో వాటా కోసమే చెల్లెలు, తల్లి ఇబ్బంది పెడుతున్నట్టు వివరించారు. 51 శాతం వాటాలు తమకు కంపెనీల్లో ఉన్నాయని.. వాటిని ఎవరికీ షేర్ చేయబోమంటూ వారు స్పష్టం చేశారు. కాగా దీనిపై ఇప్పటి వరకు జగన్ ఫ్యామిలీ ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఇలా షర్మిలపై న్యాయపోరాటానికి దిగడం అనేది మరింత ఇమేజ్ డ్యామేజ్ చేస్తుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి షర్మిల, విజయమ్మ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News