Ysrcp : జగన్ ఎక్కడుంటే అక్కడ జనసంద్రమే.. గ్రాఫ్‌ పెరుగుతోందిగా..!

Qubetvnews - April 4, 2024 / 04:36 PM IST

Ysrcp : జగన్ ఎక్కడుంటే అక్కడ జనసంద్రమే.. గ్రాఫ్‌ పెరుగుతోందిగా..!

Ysrcp : జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్‌ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఆయన వెంటే జనం నడుస్తామని చెబుతున్నారని.. ఇందుకు మేమంతా సిద్ధం పేరుతో చేస్తున్న బస్సు యాత్రనే నిదర్శనం అంటున్నారు వైసీపీ నేతలు. ఆ మధ్య సిద్ధం పేరుతో నిర్వహించిన సభలు ఎంత పెద్ద సక్సెస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాటికి కొనసాగింపుగా ఇప్పుడు మేమంతా సిద్ధం పేరుతో జగన్ బస్సు యాత్రను చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు జగన్ ఎక్కడకు వెళ్లినా సరే జనాలు నీరాజనాలు పడుతున్నారు. జగన్ వెంటే మేం అంటూ బస్సు యాత్రలో కనిపిస్తున్నారు.

రాయలసీమలో జగన్ బస్సు యాత్ర స్టార్ట్ చేస్తేఅక్కడి పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. జగన్ రోడ్డు వెంబడి వెళ్తే.. రోడ్డు పొడవునా జనాలే ఉంటున్నారు. జగన్ కు అడుగడుగునా జేజేలు కొడుతున్నారు. జనాలు కిక్కిరిసిపోవడంతో బస్సు యాత్ర నెమ్మదిగా సాగుతోందంటే.. పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇందుకు తాము ఐదేండ్లు అందించిన సుపరిపాలనే కారణం అంటున్నారు వైసీపీ లీడర్లు. రోడ్ షోలు చేస్తే బహిరంగ సభకు వచ్చినంత మంది జనాలు వస్తున్నారని చెబుతున్నారు వైసీపీ నేతలు. జగన్ కూడా వారితో ఆప్యాయంగా నడుచుకుంటున్నారు.

ఎవరినీ నిరాశ పరచకుండా అందరినీ పలకరిస్తూ ముందుకు వెళ్తున్నారు. అయితే అటు చంద్రబాబు పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి విభిన్నంగా సాగుతోంది. చంద్రబాబు కూడా రాయలసీమలోనే ప్రచారం ప్రారంభించినా.. వైయస్ఆర్‌సీపీకి వచ్చినంత రెస్పాన్స్ లేదు. చంద్రబాబు ఎక్కడ సభలు పెట్టినా సరే జగన్ కు వచ్చినంత మంది జనాలు మాత్రం రావట్లేదు. దాంతో ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి అయోమయంలో పడిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే టీడీపీలోనే సయోధ్య లేదని అంటున్నారు. టికెట్లు కేటాయించిన చోట అసంతృప్తులు రగిలిపోతున్నారు.

కూటమి నేతల మధ్య కుదరని సయోధ్య, అభ్యర్థుల ఎంపికలో వీడని చిక్కుముడులు కూడా టీడీపీని వెంటాడుతున్నాయి. దీంతో ఆ పార్టీ నాయకుల్లోనే ఆందోళన మొదలైంది. కానీ వైసీపీలో అలా లేదు. జగన్ ఎవరికి టికెట్ ఇచ్చినా సరే అందరూ కలిసికట్టుగాపని చేస్తున్నారు. జగన్ చేసిన అభివృద్ధి, సంక్షేమమే గెలుస్తుందిన అందరూ నమ్ముతున్నారు.

జనాలు కూడా ఆదరించడంతో వైసీపీ గ్రాఫ్ గణనీయంగా పెరుగుతోంది. ప్రజల్లో సీఎం వైఎస్ జగన్ కు ఉన్న ఆదరణ, పార్టీకి వస్తున్న స్పందన చూస్తుంటే ఎన్నికల ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందనే నమ్మకం తమకుందని అంటున్నాయి వైసీపీ వర్గాలు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News