Pushpa-2 :అమెరికా గడ్డపై పుష్పగాడి మాస్ రూల్..!

Qubetvnews - November 6, 2024 / 04:19 PM IST

Pushpa-2 :అమెరికా గడ్డపై పుష్పగాడి మాస్ రూల్..!

Pushpa-2 : పుష్ప-2 సినిమా విడుదల కాక ముందే చాలా రికార్డులు కొల్లగొడుతోంది. ఇప్పటికే మూవీ వెయ్యి కోట్ల బిజినెస్ చేసి లెక్కలు మార్చేసిందని అంటున్నారు. అటు ట్రైలర్ రిలీజ్ ను కూడా గ్రాండ్ గా చేయబోతున్నారంట. దీని కోసం పెద్ద ఈవెంట్ ను నిర్వహిస్తామని ఇప్పటికే మూవీ టీమ్ ప్రకటించింది. అయితే తాజాగా మూవీ మరో రికార్డును నమోదు చేసింది. పుష్ప-2ను డిసెంబర్ 5న రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దాని కోసం ఇప్పటి నుంచే భారీగా బజ్ క్రియేట్ అయింది. ఈ మూవీని ఓవర్సీస్ లో రిలీజ్ డేట్ కు ముందుగానే ప్రీమియర్స్ వేయబోతున్నారు.

అయితే ఓవర్సీస్ లో ఈ మూవీకి విపరీతమైన హైప్ ఉండటంతో మూవీ టికెట్స్ బుకింగ్స్ లో నయా రికార్డు నమోదు చేసింది మూవీ. అత్యంత వేగంగా 15వేల టికెట్లు అమ్ముడు పోయాయని మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమాకు కూడా ఇంత భారీగా టికెట్లు అమ్ముడు పోలేదని.. ఇదొక రికార్డు అంటూ పోస్టర్ వేసింది మూవీ టీమ్. దాంతో ఇందుకు సంబంధించిన పోస్టర్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అది చూసిన బన్నీ ఫ్యాన్స్.. తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ ఓపెన్ చేస్తే రికార్డులు బద్దలైపోతాయంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇక ట్రైలర్ లాంచ్ ను ఈ నెల 15న విడుదల చేయబోతున్నారంట. దానికి సంబంధించిన ప్రోగ్రామ్ కు భారీగా అతిథులు వస్తారంటూ ప్రచారం జరుగుతోంది. కానీ ఇంకా దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. మరి ఓవర్సీస్ లోనే ఇలా ఉంటే.. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉంటుందో వేచి చూడాలి.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News