Anasuya Bharadwaj : ఆయనతో లేచిపోదామనుకున్న అనసూయ.. ఆమె తండ్రి ఏం చేశాడంటే
Qubetvnews - February 17, 2024 / 07:44 AM IST
Anasuya Bharadwaj :
అనసూయ భరద్వాజ్ ఈ పేరుతో పరిచయం అవసరం లేదు. బుల్లితెర పై ఓ సెన్సేషన్ సృష్టించిన యాంకర్. జబర్దస్త్ షోతో ప్రతి ఇంటికి పరిచయం అయింది. కొన్నాళ్ల క్రితం ఆ షోకు గుడ్ బై చెప్పి వెండితెరకే పరిమితం అయింది. వివిధ రకాల వివాదాలతో నిత్యం ట్రెండింగ్ లో ఉంటుంది అనసూయ. అలాంటి ఆమె గురించి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెళ్లికి ముందు అనసూయ ఓ వ్యక్తితో లేచిపోదామనుకుందట. అనసూయకు పెళ్లయి పదిహేనేళ్లు కావొస్తుంది. పెళ్లి తర్వాత కూడా తన కెరీర్‌ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లగలనని అనసూయ నిరూపించుకుంది. సరిగ్గా ప్లాన్ చేసుకుంటే సినిమాల్లో కూడా సక్సెస్ మీ వెంటే వస్తుందని ఈ క్యూటీ చూపిస్తోంది.
ఆమె వృత్తి జీవితంలోనే కాదు, వ్యక్తిగత జీవితంలో కూడా.. ముఖ్యంగా ప్రేమ విషయంలో అనసూయ చాలా ఇబ్బందులు పడింది. ఆమె ప్రేమ కథ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నప్పుడు అనసూయ ఒకసారి ఎన్‌సీసీ క్యాంప్‌కి వెళ్లింది. ఆ క్యాంప్‌కు గ్రూప్ కమాండర్‌గా ఉన్నందున.. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే శిక్ష తప్పదని అనుసూయ చెప్పింది. అదే శిబిరానికి వచ్చిన మరో విద్యార్థి సుశాంక్ భరద్వాజ్.. ఆమెను చూసి మనసు పారేసుకున్నాడట. వెంటనే క్షణం ఆలోచించకుండా తన మనసులో ఉన్న మాటని అనసూయకు చెప్పేసాడట.
ప్రేమ గీమా కాదని.. డైరెక్టుగా పెళ్లి చేసుకుంటానని చెప్పాడట. అసలు ఆ వయసులో ప్రేమంటే ఏమిటో తెలియని అనసూయ ఆశ్చర్యపోవడమే కాదు.. భరద్వాజ్‌కి ధైర్యం పడిపోయిందట. కానీ ఏమీ మాట్లాడకుండా క్యాంపు నుంచి రావడం.. ఆ తర్వాత ఎవరి దారి వారు చూసుకోవడం.. మళ్లీ సరిగ్గా ఏడాదిన్నర తర్వాత మళ్లీ క్యాంప్‌లో ఇద్దరూ కలిసి మాట్లాడుకోవడంతో.. అనసూయ భరద్వాజ్‌కి కూడా భరద్వాజ్‌పై మంచి అభిప్రాయం ఏర్పడింది. అలా తమ స్నేహం మొదలైందని ఓ ఇంటర్వ్యూలో అనసూయ చెప్పుకొచ్చింది.
మెల్లమెల్లగా అతనంటే ప్రేమ మొదలైందని.. అయితే ఈ విషయం అప్పుడే తన తల్లికి చెప్పిందని అనసూయ తెలిపింది. అయితే అనసూయకు ఇద్దరు చెల్లెళ్లు ఉండటంతో.. ఆమెకు మంచి సంబంధం కుదిరితే… మిగిలిన వారికి కూడా మంచి సంబంధాలు వస్తాయని అనసూయ తండ్రి భావించాడట. కానీ భరద్వాజ్‌తో ప్రేమ మొదలైన మూడేళ్ల వాళ్ల నాన్న అనసూయ కోసం మరో మంచి సంబంధం తీసుకొచ్చాడట. ఆ తర్వాత రోజుకో సంబంధం వచ్చేదట.. దాంతో తన ప్రేమ విషయం చెప్పేసరికి.. ఇంట్లో నాన్నతో చాలా గొడవలు జరిగాయని పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంది అనసూయ.
ఆ తర్వాత ప్రేమించిన భరద్వాజ్ కోసం ఇంటి నుంచి బయటకు వచ్చేసి కొన్నాళ్లపాటు హాస్టల్‌లో ఉంది. కొన్ని రోజుల తర్వాత ఇంట్లోకి రానిచ్చినా కూడా భరద్వాజ్‌తో పెళ్లికి మాత్రం ససేమిరా అన్నాడట వాళ్ల నాన్న. ఈ క్రమంలోనే మీరు నాకు నచ్చిన భరద్వాజ్‌తో పెళ్లి చేసే వరకు నేను ఎక్కడికీ వెళ్ళనంటూ అనసూయ మొండి పట్టుదలతో చెప్పేయడంతో ఇంట్లో వాళ్లు కూడా ఏమీ అనలేక పెళ్లికి ఒప్పేసుకున్నారట. అయితే అనసూయకు మాత్రం వాళ్ల నాన్నతో మాటలు కట్ అయ్యాయి. ఆయనకు నచ్చడానికి.. ఈ పెళ్లి ఒప్పుకోడానికి కొన్నాళ్లు సమయం తీసుకున్నాడు. భరద్వాజ్ అనసూయకి ప్రపోజ్ చేసిన 9 ఏళ్ళ తర్వాత కానీ వీరిద్దరికీ పెళ్లి జరిగిందట.

Anasuya Bharadwaj Love Story Very Interesting
ఈ తొమ్మిదేళ్లలో అప్పుడప్పుడు ఓపిక నశించి.. మనం లేచిపోయి పెళ్లి చేసుకుందామని భరద్వాజ్‌తో చెప్పినా కూడా.. పెద్దల అంగీకారంతోనే మన పెళ్లి జరగాలని సర్ది చెప్పేవాడట భరద్వాజ్. చివరికి రెండు కుటుంబాల అంగీకారంతో 2010 జూన్ 6 అనసూయ.. భరద్వాజ్ ల పెళ్లి అయిపోయింది. ఇప్పుడు వారి ప్రేమకు గుర్తుగా ఇద్దరు పిల్లలు కలిగారు. మొత్తానికి పద్నాలుగు ఏళ్ల కాపురంలో ఎన్నో మధుర జ్ఞాపకాలున్నాయని చెబుతుంది అనసూయ భరద్వాజ్. ఏదేమైనా ప్రేమించిన వాడి కోసం ఏకంగా తొమ్మిదేళ్లు పోరాటం చేసింది అనసూయ.





