Pushpa-2 : హైదరాబాద్ లో ఆంక్షలు.. పుష్ప-2కు భారీ ఎఫెక్ట్..?
Qubetvnews - October 28, 2024 / 06:42 PM IST
Pushpa-2 : ఇప్పడు టాలీవుడ్ చూపు మొత్తం పుష్ప-2 మీదనే ఉంది. భారీ హైప్ మధ్య ఈ సినిమాను తీసుకొస్తున్నారు. మొదటి పార్టు పెద్ద విజయం సాధించడంతో పార్టు-2ను భారీగా తెరకెక్కించామని చెబుతున్నారు. డైరెక్టర్ సుకుమార్ ఇప్పటికే మూవీని భారీ స్థాయిలో తీస్తున్నాడని అంటున్నారు. పైగా విడుదలైన పోస్టర్లు, టీజర్లు మూవీపై భారీ అంచనాలు పెంచేశాయి. మైత్రి మూవీ మేకర్స్ కూడా డబ్బులకు వెనకాడకుండా మూవీని తీసిందని చెబుతున్నారు. డిసెంబర్ 5న విడుదలవుతున్న ఈ మూవీకి భారీ ఈవెంట్ ను కూడా ప్లాన్ చేస్తున్నామని నిర్మాత రీసెంట్ గానే ప్రకటించారు.
దాంతో ఫ్యాన్స్ లో తీవ్ర అంచనాలు పెరిగిపోయాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీగా ప్లాన్ చేసి పెద్ద సెలబ్రిటీలను పిలిచి మూవీకి కావాల్సినంత బజ్ తీసుకురావాలని అనుకున్నారు మూవీ టీమ్. పైగా ఇప్పటి వరకు ఎవరూ చేయని విధంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను డిఫరెంట్ గా ప్లాన్ చేయాలని చూశారంట. కానీ పుష్ప-2కు ఇప్పుడు భారీ దెబ్బ పడింది. హైదరాబాద్ లో తరచూ ధర్నాలు, ర్యాలులు జరుగుతుండటంతో.. సిటీలో పోలీసులు ఆంక్షలు విధించారు. కొన్ని పార్టీలు, సంస్థలు కలిసి హైదరాబాద్ లో అశాంతి సృష్టించాలని చూస్తున్నాయని.. అందుకే సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు నిర్వహించకుండా ఆంక్షలు విధిస్తున్నట్టు తెలిపారు.
దాంతో ఇప్పుడు పుష్ప-2 ఈవెంట్ ను నిర్వహిస్తారా లేదా అనే అనుమానం మొదలైంది. వాస్తవానికి ఈ ఈవెంట్ ను హైదరాబాద్ లోనే భారీగా ప్లాన్ చేయాలని చూశారు. ఇప్పుడు పోలీసుల ఆంక్షలు ఉండటంతో ఈవెంట్ ను నిర్వహించడం కష్టమే అంటున్నారు. గ్రౌండ్ లెవల్ సభ పెట్టకపోతే ఫ్యాన్స్ లో అంచనాలు తగ్గుతాయి. ఒక సినిమాను ఫ్యాన్స్ కు దగ్గర చేసేందుకు ఈ ఈవెంట్ బాగా ఉపయోగపడుతుంది. కానీ ఫ్యాన్స్ కు దూరం చేస్తే సినిమాపై ఎఫెక్ట్ పడుతుంది. మొన్న దేవర సినిమా ఈవెంట్ నుముందుగా ప్లాన్ చేస్తే.. చిన్న స్టేడియంలో పెద్ద ఈవెంట్ కష్టం అని చివరకు రద్దు చేయాల్సి వచ్చింది.
ఇప్పుడు పుష్ప-2 ముందు కూడా అలాంటి సవాల్ ఉంది. మహా అయితే రెండు అవకాశాలు ఇప్పుడు బన్నీ ముందు ఉన్నాయి. ఒకటి నవంబర్ 28న ఈవెంట్ నిర్వహించుకోవాలి. లేదంటే హైదరాబాద్ బయట దీన్ని ప్లాన్ చేయాలి. ఒకవేళ పోలీసులు ఆంక్షలను పొడిగిస్తే అప్పుడు హైదరాబాద్ లో నిర్వహించడం కూడా కష్టమే. పైగా సినిమాకు ఫ్యాన్స్ ర్యాలీలు, హడావిడి కూడా ఉండదు. రిలీజ్ డేట్ వరకు ఆంక్షలు లేకపోతే అప్పుడు ప్లస్ అవుతుంది.





