Prabhas : ప్రభాస్ ను బతికిస్తున్న హిట్ సీక్వెల్స్.. అందుకే హైప్ తగ్గట్లేదా..!

Qubetvnews - June 29, 2024 / 07:59 PM IST

Prabhas : ప్రభాస్ ను బతికిస్తున్న హిట్ సీక్వెల్స్.. అందుకే హైప్ తగ్గట్లేదా..!

Prabhas : బాహుబలికి ముందు ప్రభాస్ అంటే తెలుగు స్టార్ హీరో. కానీ ఆ తర్వాత మాత్రం ఇండియన్ స్టార్ హీరో. అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నెత్తిన కూర్చున్నాడు. తనకు దరిదాపుల్లో ఏ బాలీవుడ్ స్టార్లు కూడా లేకుండా పోయారంటే.. ప్రభాస్ రేంజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతటి స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న ప్రభాస్ కు ప్లాపులు కూడా ఆ రేంజ్ లోనే వెంటాడుతున్నాయి. బాహుబలి-2 తర్వాత ఆయన రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. దాంతో ఆయన నుంచి తర్వాత ఏ సినిమా వస్తుందా.. ఏ రేంజ్ లో ఉంటుందా అని అంతా ఎదురు చూశారు.

సాహో రూపంలో పెద్ద సినిమానే వచ్చింది. కానీ యావరేజ్ టాక్ తో నిరాశ పర్చింది. ఇక దాని తర్వాత వచ్చిన రాధేశ్యామ్ కూడా దారుణంగా ప్లాప్ అయింది. దాంతో నెమ్మదిగా ప్రభాస్ ఇమేజ్ తగ్గుతూ వచ్చింది. ఒక హిట్ పడితే బాగుండు అనుకుంటున్న సమయంలో ఆదిపురుష్ మూవీ భారీ అంచనాలతో వచ్చింది. కానీ సినిమా చూసి తిట్టుకోని వారు లేరంటే ఎంత దరిద్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభాస్ కెరీర్ లోనే అత్యంత చెత్త సినిమాగా రికార్డు నమోదు చేసింది. ఆ దెబ్బకు ప్రభాస్ ఇమేజ్ కుప్పకూలిపోవడం స్టార్ట్ అయింది. ఇక ఎట్టి పరిస్థితుల్లో హిట్ పడితేనే ప్రభాస్ కు పాన్ ఇండియా కెరీర్ ఉంటుంది అని అంతా అనుకున్నారు.

ఆ సమయంలోనే ప్రశాంత్ నీల్ చెక్కిన సలార్ మూవీ వచ్చింది. ఇండస్ట్రీని షేక్ చేసి పడేసింది. ప్రభాస్ కు హిట్ సినిమా పడితే కలెక్షన్ల సునామీ ఎలా ఉంటుందో చూపించింది. ఆ మూవీ మంచి హిట్ కొట్టింది. దాని తర్వాత చాలా కాలంగా ఎదురు చూస్తున్న కల్కి మూవీ కూడా గురువారం రోజున విడుదలైంది. ఈ మూవీ అయితే ఇండస్ట్రీ రికార్డులు మొత్తం తిరగరాసేలా ఉంది. ఇంకో యాభై ఏండ్లు అయినా సరే కల్కి మూవీ గురించి చెప్పుకునే విధంగా ఉంది ఈ మూవీ. హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంది. అయితే ఇక్కడే ప్రభాస్ ఫ్యాన్స్ కు ఓ పెద్ద గుడ్ న్యూస్ లు కూడా ఉన్నాయి.

అదేంటంటే.. ప్రభాస్ ఏ డైరెక్టర్ తో రెండు పార్టులుగా సినిమాలు తీయడానికి ఒప్పుకుంటున్నాడో.. ఆ సినిమాలే హిట్ అవుతున్నాయి. అప్పట్లో బాహుబలి ముందే రెండు పార్టులుగా తీస్తామని తెలిపారు. దాంతో ఆ మూవీ ప్రభాస్ ను ఎక్కడికో తీసుకెళ్లింది. దాని తర్వాత సలార్ ను కూడా రెండు పార్టులుగా తెస్తామని రిలీజ్ కు ముందే చెప్పారు. అది కూడా తిరుగులేని హిట్ కొట్టింది.

ఇప్పుడు కల్కి మూవీని కూడా రెండు పార్టులుగా తెస్తామని ముందే ప్రకటించారు. ఇంకేముంది ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. అంటే ప్రభాస్ కు హిట్ సీక్వెల్ అనేది కలిసొస్తుందన్నమాట.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News