Keerthy Suresh : ఆ స్టార్ హీరోకు లిప్ లాక్ ఇవ్వనని చెప్పిన కీర్తి సురేష్.. దారుణ అవమానం..!

Qubetvnews - February 18, 2024 / 06:01 AM IST

Keerthy Suresh : ఆ స్టార్ హీరోకు లిప్ లాక్ ఇవ్వనని చెప్పిన కీర్తి సురేష్.. దారుణ అవమానం..!

Keerthy Suresh :

కీర్తి సురేష్ కు సినిమాల పరంగా మంచి గుర్తింపే ఉంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఆమె మొదటి నుంచి తన సినిమాలలో చాలా క్లీన్ ఇమేజ్ తో కనిపిస్తోంది. ఏ మాత్రం కూడా బోల్డ్ గా కనిపించకుండా మెయింటేన్ చేస్తూ వస్తోంది. ఆమె ఎలాంటి బోల్డ్ సీన్లు చేయనని ముందు నుంచే కొన్ని కండీషన్లు కూడా పెట్టుకుంది. అందుకే చాలా వరకు సినిమాల్లో ఎలాంటి ఎలాంటి బోల్డ్ సీన్లు చేయట్లేదు. అంతే కాకుండా హీరోలతో కూడా ఎలాంటి లిప్ లాక్ సీన్లు కూడా చేయలేదు. అందుకే ఆమెకు క్లీన్ ఇమేజ్ కారణంగా చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఏర్పడింది.

ఇక ఆమె కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా మహానటి. ఈ సినిమాలో ఆమె సావిత్రి బయోపిక్ లో నటించింది. ఇది చాలా పెద్ద హిట్ అయింది. ఇందులో కీర్తి సురేష్ నటనకు ఏకంగా జాతీయ ఉత్తమ నటి అవార్డు కూడా సొంతం అయిపోయింది. అంత గొప్పగా నటించి మెప్పించింది ఈ భామ. ఆ సినిమా తర్వాతనే ఆమెకు స్టార్ హీరోల సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి. పవన్ కల్యాణ్ తో చేసిన అజ్ఞాత వాసిలో నటించింది. కానీ ఆ మూవీ ఆమెకు ఎలాంటి గుర్తింపు తీసుకురాలేదు. ఇక దాని తర్వాత మహేశ్ బాబుతో చేసిన సర్కారు వారి పాట సినిమాలో కూడా నటించింది.

ఆ మూవీ చాలా పెద్ద హిట్ అయింది. దాని తర్వాత నానితో కలిసి దసరా మూవీ చేసి పెద్ద హిట్ అందుకుంది. ఇప్పుడు వరుస సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. కాగా కీర్తి సురేష్ కు సంబంధించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఆమె ఓ స్టార్ హీరోకు లిప్ లాక్ ఇవ్వనని చెప్పి సినిమా కూడా చేయలేదంట. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదండోయ్ యంగ్ స్టార్ నితిన్. కీర్తి సురేష్‌ కు టాలీవుడ్ కు కొత్తలో వచ్చిన సమయంలో నితిన్ సరసన ఓ సినిమా ఛాన్స్ వచ్చింది. అయితే ఆ సినిమాను నితిన్ వద్దని చెప్పాడంట. ఎందుకంటే అందులో డీప్ లిప్ లాక్ ఉందని ఆమె వద్దని చెప్పిందంట.

దాంతో తాను అలాంటి సీన్లు చేయబోనని తెగేసి చెప్పి సినిమాను రిజెక్ట్ చేసింది కీర్తి సురేష్‌. అప్పుడు నితిన్ వరుస హిట్లతో మంచి జోష్ మీద ఉన్నాడు. ఆ సమయంలో మూవీ ఆఫర్ చేస్తే కీర్తి సురేష్ డైరెక్టుగా రిజెక్ట్ చేసేసింది. దాంతో చేసేది లేక వేరే హీరోయిన్ ను తీసుకున్నారంట.

Keerthy Suresh Didnt Do Lip Lock Scenes

Keerthy Suresh Didnt Do Lip Lock Scenes

ఈ విషయాన్ని కీర్తి సురేష్ ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది. కాగా నితిన్ తో తాను మరో సినిమా చేస్తానని ముందే చెప్పానని.. ఇద్దరం కలిసి రంగ్ దే సినిమా చేసినట్టు తెలిపింది. ఆ మూవీ పర్లేదు అనిపించుకుంది. కాగా ఇప్పుడు కీర్తి సురేష్ గ్లామర్ ఎక్స్ పోజింగ్ కు ఓకే చెబుతోంది. కానీ లిప్ లాక్ సీన్లు మాత్రం చేయట్లేదు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News