Keerthy Suresh : సీక్రెట్ లవ్ ను బయట పెట్టేసిన కీర్తి సురేష్.. ఆ లవ్ లెటర్ ఇప్పటికీ నా దగ్గరే ఉందంటూ..!
Qubetvnews - February 17, 2024 / 06:59 AM IST
Keerthy Suresh :
కీర్తి సురేష్ అంటే ఓ క్లీన్ ఇమేజ్ ఉంది. ఇప్పటి వరకు ఆమె ఎలాంటి బోల్డ్ సీన్లు చేయలేదు. పైగా ఎలాంటి కాంట్రవర్సీల్లో కూడా ఉండలేదు. పైగా చేసిన సినిమాలు అన్నీ క్లీన్ గానే ఉండేలా చూసుకుంది. పైగా ఎక్స్ పోజింగ్ కు కూడా దూరంగానే ఉంటూ వస్తోంది. ఇలాంటి సమయంలో ఆమెకు కొన్ని అవకాశాలు తగ్గడంతో ఆమె కూడా రూట్ మారుస్తున్నట్టు కనిపిస్తోంది. ఎం దుకం టే సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ ఫీల్డ్. ఇక్కడ ఎంతగా అందాలను ఆరబోస్తే అన్ని అవకాశాలు వస్తుంటాయి. ఆ విషయం కీర్తి సురేష్ కు కూడా బాగానే తెలిసినట్టు ఉంది.
అందుకే ఆమె మహేశ్ బాబుతో చేసిన సర్కారు వారి పాట సినిమాలో ఇలాగే రెచ్చిపోయింది. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడిపేస్తోంది. ఇది కాసేపు పక్కన పెడితే ఆమె పర్సనల్ లైఫ్ కు సంబంధించిన ఓ విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది. అదేంటో తెలుసుకుందాం. కీర్తి సురేష్ పై ఇప్పటి వరకు ఎలాంటి లవ్ ఎఫైర్ రూమర్లు రాలేదు. కానీ ఆమెకు కూడా ఓ లవ్ సీక్రెట్ ఉందంట. ఈ విషయాలను ఆమెనే స్వయంగా వెల్లడించింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు వాలంటైన్స్ డే సందర్భంగా మరోసారి వైరల్ అవుతున్నాయి.
అసలు ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆమె మాట్లాడుతూ నాకు కూడా అప్పట్లో ఓ లవ్ లెటర్ వచ్చింది. దాన్ని ఇప్పటికీ నా దగ్గరే భద్రంగా దాచుకున్నాను. నేను అప్పట్లో ఓ షాపింగ్ మాలో ఓపెనింగ్ ప్రోగ్రామ్ కు వెళ్లాను. అక్కడకు చాలా మంది వచ్చారు. అందులో ఓ అబ్బాయి తాను రాసిన లవ్ లెటర్ ను ఓ బుక్ లో పెట్టి నాకు ఇచ్చేసి వెళ్లిపోయాడు. అతను నన్ను ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇంటికి వెళ్లిన తర్వాత ఆ బుక్ ఓపెన్ చేసి చూశాను. అందులో నా ఫొటోలతో పాటు అతను రాసిన లవ్ లెటర్ కూడా ఉంది.
అది చదువుకున్న తర్వాత చాలా నవ్వుకున్నాను. అందులో ఇష్టం ఉంటే అతన్ని పెళ్లి చేసుకోవాలంటూ ఉంది. అతని అడ్రస్, ఫోన్ నెంబర్ కూడా అందులో రాసిపెట్టి ఉంది. అది నాకు వచ్చిన మొదటి లవ్ లెటర్. అందుకే దాన్ని ఇప్పటికీ నా దగ్గరే దాచుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది కీర్తి సురేష్.
ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఆమె ఎవరితోనూ లవ్ లో లేదని తెలుస్తోంది. ఆ మధ్య కొన్ని రూమర్లు వచ్చినా అవి నిజం కాదన తేలిపోయింది. ప్రస్తుతానికి కీర్తి సురేష్ తన సినిమాలపై మాత్రమే ఫోకస్ పెట్టింది.
