Ariyana : అరియానాతో రాజ్ తరుణ్ కు ఎఫైర్.. మరో బాంబు పేల్చిన లావణ్య

Qubetvnews - July 8, 2024 / 06:50 PM IST

Ariyana : అరియానాతో రాజ్ తరుణ్ కు ఎఫైర్.. మరో బాంబు పేల్చిన లావణ్య

Ariyana : రాజ్ తరుణ్‌ యవ్వారం ఇప్పుడు మంచి కాక మీద ఉంది. మొన్నటి వరకు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియని ఆయన పేరు.. ఇప్పుడు అటు మీడియాను, ఇటు సోషల్ మీడియాను ఊపేస్తోంది. లావణ్య అనే యువతి తాను రాజ్ తరుణ్ ప్రియురాలు అని.. మేమిద్దరం కలిసి 11 ఏళ్లుగారిలేషన్ లో ఉన్నామని తెలిపింది. అంతే కాకుండా తామిద్దరం గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామంటూ సంచలనం రేపింది. రాజ్ తరుణ్ తనను వదిలేసి తిరగబడరా సామి సినిమా హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో ఎఫైర్ పెట్టుకున్నాడని.. తనను ఇద్దరూ కలిసి బెదిరిస్తున్నారంటూ ఆమె కేసు కూడా పెట్టింది.

ఇక రాజ్ తరుణ్ కూడా దీనిపై స్పందించాడు. లావణ్యతో రిలేషన్ లో ఉన్న మాట వాస్తవమే అని.. కానీ పెళ్లి చేసుకోలేదంటూ చెప్పాడు. ఆమెకు మరో వ్యక్తితో ఎఫైర్ ఉందని.. గతంలో డ్రగ్స్ కేసులో జైలుకు వెళ్లిందని.. అందుకే ఆమెకు దూరంగా ఉన్నానని తెలిపారు రాజ్. అటు మాల్వి కూడా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని లావణ్యపై కేసు పెట్టింది. రాజ్ తరుణ్‌ కూడా ఆమెపై కేసు పెట్టాడు. కానీ లావణ్య మాత్రం అక్కడితో ఆగిపోవట్లేదు. తాజాగా రాజ్ తరుణ్‌ యవ్వారాలను బయటపెడుతోంది. ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్ అరియానా గ్లోరీతో కూడా రాజ్ తరుణ్ కు ఎఫైర్ ఉందని బాంబు పేల్చింది.

గతంలో అరియానాతో రాజ్ తరుణ్ ఓ సినిమా చేశాడని.. అందులో వారిద్దరు ఒక్క రోజు మాత్రమే కలిసి నటించినా.. ఇద్దరి మధ్య ఎఫైర్ కు దారి తీసిందని తెలిపింది. తాను నెల రోజులు కోర్స్ నేర్చుకోవడానికి గోవా వెళ్లిన సమయంలో.. తరచూ అరియానా, రాజ్ తరుణ్ కలుసుకున్నారని.. ఆ విషయం తనకు నటుడు రాజా రవీంద్ర ఫోన్ చేసి చెప్పినట్టు తెలిపింది లావణ్య. అరియానాతో మాత్రమే కాకుండా ఇంకా చాలా మందితో రాజ్ తరుణ్‌ కు ఎఫైర్ ఉందని సంచలన వ్యాఖ్యలు చేసింది. దాంతో ఈ కామెంట్లు కాస్తా ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి.

ఇప్పటి వరకు ఈ వ్యాఖ్యలపై అటు రాజ్ తరుణ్ గానీ.. అరియానా గానీ అస్సలు స్పందించలేదు. దాంతో ఈ రూమర్లకు మరింత బలం పెరుగుతోంది. ఇన్ని రోజులు రాజ్ తరుణ్, అరియానా మీద ఎలాంటి రూమర్లు రాలేదు. కానీ ఇప్పుడు వీరిద్దరిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో వారిద్దరూ జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి అరియానా ఏమైనా స్పందిస్తుందా లేదా అనేది చూడాలి.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News