Jabardasth Comedy Show : జబర్దస్త్ లో కొత్త రూల్స్.. టీమ్ లీడర్లను బౌన్సర్లతో కొట్టిస్తున్న జడ్జిలు.. ఇదేం దారుణం..!
Qubetvnews - February 20, 2024 / 10:18 AM IST
Jabardasth Comedy Show :
బుల్లితెరపై జబర్దస్త్ ఓ ట్రెండ్ సెట్ చేసింది. అప్పటి వరకు కామెడీ అంటే కేవలం సినిమాల్లోనే చూస్తున్న వారికి.. సరికొత్త కామెడీని పంచుతూ అలరిస్తోంది ఈ షో. దాంతో ఈ షోకు విపరీతంగా క్రేజ్ పెరిగిపోయింది. చమ్మక్ చంద్ర, సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, బుల్లెట్ భాస్కర్ లాంటి వారు ఈ షో రేటింగ్స్ ను అమాంతం పెంచేశారు. దాంతో ఈ షోకు విపరీతమైన క్రేజ్ దక్కింది. ఈ షో ద్వారా పరిచయం అయిన చాలా మంది ఇప్పుడు సినిమాల్లో స్టార్లుగా మారిపోయారు. సుడిగాలి సుధీర్ అయితే ఏకంగా వరుసగా సినిమాలు చేస్తున్నాడంటే ఈ షో వల్ల ఎలాంటి క్రేజ్ దక్కుతుందో అర్థం చేసుకోవచ్చు.
కాగా ఇప్పుడు ఈ షో నుంచి పెద్ద కమెడియన్లు అందరూ తప్పుకున్నారు. దాంతో ఈ షోకు కొన్ని రోజులు రేటింగ్ తెచ్చుకోలేకపోయింది. ఇక జడ్జిలు కూడా మారిపోయారు. కృష్ణ భగవాన్, ఇంద్రజ జడ్జిలుగా వచ్చిన తర్వాత ఈ షో మరో మలుపు తిరిగింది. కొత్త ట్యాలెంట్ ను వీరు ఎంకరేజ్ చేస్తున్నారు. దాంతో ఇప్పుడు జబర్దస్త్ లో పాతలాగా కాకుండా కొత్త రీతిలో స్కిట్స్ చేస్తున్నారు. ఇప్పుడు జబర్దస్త్ మళ్లీ క్లిక్ అవుతోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా జబర్దస్త్ కు సంబంధించిన లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయింది. ఇందులో చూసుకుంటే కొత్త రూల్ పెట్టినట్టు జడ్జిలు తెలిపారు.
షో స్టార్ట్ అయ్యే ముందే వారు ఇలాంటి రూల్ గురించి వివరించారు. ఎవరి స్కిట్ అయితే పంచ్ లు పేలవో ఆ టీమ్ లీడర్లను బౌన్సర్లతో కొట్టిస్తామని చెప్పారు. కృష్ణ భగవాన్, ఇంద్రజ చెప్పిన ఈ కొత్త రూల్ తో అందరూ షాక్ అయిపోయారు. కాగా ఈ షో కొత్త రూల్ ను ముందుగా రాఘవ టీమ్ లో కనిపించింది. ఆయన టీమ్ చేసిన స్కిట్ పెద్దగా పేలలేదని.. నీరసంగా ఉండేలా పంచులు వేశారంటూ చెబుతూ ఆయన్ను బౌన్సర్లతో కొట్టించారు. దాంతో ఆ స్కిట్ కాస్తా ఇంకో మలుపు తీసుకుంది. ఇది చూసిన వారు షాక్ అయిపోయారు. అసలు ఇలాంటి చెత్త రూల్ ఎందుకు పెట్టారంటూ కామెంట్లు పెడుతున్నారు.

New Rules In Jabardasth Comedy Show
కామెడీ పండకపోతే కొట్టిస్తే స్కిట్ చూస్తారా ఎక్కడైనా.. ఇలాంటి దిక్కుమాలిన రూల్స్ ఏంటంటూ జబర్దస్త్ మేనేజ్ మెంట్ పై విరుచుకుపడుతున్నారు. అయితే ఇది నిజమో కాదో తెలియాల్సి ఉంది. ఎందుకంటే జబర్దస్త్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పుడప్పుడు స్కిట్ లో భాగంగా ఇలాంటివి కూడా పెడుతుంటారు.
గతంలో కూడా కొన్ని సార్లు జడ్జిలు స్వయంగా వచ్చి టీమ్ లీడర్లను కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు బౌన్సర్లతో కొట్టించినంత మాత్రాన దాన్ని నిజం అని అనుకోలేం. మరి ఇది నిజమా లేక స్కిట్ లో భాగంగానే జరిగిందా అనేది తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.





