Prabhas : మొత్తానికి పెళ్లిపై అప్ డేట్ ఇచ్చిన ప్రభాస్.. ఒక్క పోస్టుతో ప్రకంపనలు..!

Qubetvnews - May 17, 2024 / 05:24 PM IST

Prabhas : మొత్తానికి పెళ్లిపై అప్ డేట్ ఇచ్చిన ప్రభాస్.. ఒక్క పోస్టుతో ప్రకంపనలు..!

Prabhas : సినీ ఇండస్ట్రీలో మోస్ట్ వెయిటెడ్ మూమెంట్ ఏదైనా ఉందా అంటే అది ప్రభాస్ పెళ్లి అని డార్లింగ్ ఫ్యాన్స్ చెబుతుంటారు. ఎందుకంటే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ప్రభాస్ ఉన్నాడు. ఎన్ని హైట్స్ చూడాలో అన్నీ చూసేశాడు. తెలుగు ఇండస్ట్రీని తలెత్తుకునేలా చేశాడు. తెలుగు సినిమాలను హాలీవుడ్ రేంజ్ కు తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు తెలుగులో అందరికంటే ఎక్కువ క్రేజ్ ఉన్న హీరో, బడా ప్రాజెక్టులు చేస్తున్న హీరో కూడా ప్రభాసే. ఇటు కేవలం తెలుగులోనే కాకుండా అటు పాన్ ఇండియా వ్యాప్తంగా ఆయనకు బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది.

ఇంత ఉన్నా కూడా ప్రభాస్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. కానీ ఎప్పటికప్పుడు ఆయన పెళ్లిపై ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంది. ఇదిగో పెళ్లి.. అదిగో పెళ్లి అంటూ సోషల్ మీడియాలో ఏదో ఒక న్యూస్ వినిపిస్తూనే ఉంది. ఇక ప్రభాస్ మీద వచ్చిన రూమర్లు అన్నీ ఇన్నీ కాదు. ఆ హీరోయిన్ తో పెళ్లి, ఈ హీరోయిన్ తో డేటింగ్ అంటూ నానా రకాల వార్తలు వస్తున్నా ప్రభాస్ మాత్రం ఎప్పుడూ నోరు మెదపలేదు. అవన్నీ ఫేక్ అని ఎప్పటికప్పుడు తేలిపోతూనే ఉంది. అయితే తమ హీరో పెళ్లి చేసుకుంటే చూడాలని డార్లింగ్ ఫ్యాన్స్ వేయి కండ్లతో చూస్తున్నారు. ఇప్పుడు వారందరికీ ఓ బంపర్ న్యూస్ చెప్పారు ప్రభాస్.

మొత్తానికి త్వరలోనే తన జీవితంలోకి స్పెషల్ పర్సన్ రాబోతోందని.. వెయిట్ చేయండి అంటూ ఓ పోస్ట్ వదిలాడు ప్రభాస్. ఇంకేముంది ఈ పోస్ట్ క్షణాల్లోనే సోషల్ మీడియాను కుదిపేస్తోంది. కచ్చితంగా ప్రభాస్ పెళ్లి గురించే చెప్పాడని.. త్వరలోనే తన పెళ్లి ఎవరితో, ఎప్పుడు అనేది చెప్పబోతున్నాడంటూ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. ఇన్నేళ్లకు తమ కోరిక నెరవేరబోతోందంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు ఫ్యాన్స్. మూవీ గురించి అయితే ఇలాంటి పోస్ట్ ప్రభాస్ ఎన్నడూ చేయలేదు. మొత్తానికి స్పెషల్ పర్సన్ వస్తున్నారంటూ చెప్పాడు అంటే.. ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు ఇలా చెప్పాడని అంటున్నారు అభిమానులు.

కచ్చితంగా ప్రభాస్ పెళ్లి గురించే ఈ న్యూస్ అని వారు చెబుతున్నారు. తమ హీరో ఓ ఇంటి వాడు అయితే చూడాలని ఆశపడ్డ అభిమానులకు మొత్తానికి ప్రభాస్ గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడన్న మాట. అయితే ఇక్కడే ఇంకో ట్విస్ట్ కూడా ఉందని ఇంకొంతమంది నెటిజన్లు అంటున్నారు.

అదేదో సినిమా అప్ డేట్ కూడా కావచ్చేమో అని చెబుతున్నారు. ఇలా ఎవరికి వారు తోచింది కామెంట్ చేసేస్తున్నారు. కానీ తన జీవితంలోకి స్పెషల్ పర్సన్ రాబోతున్నారంటూ చెప్పాడు అంటే కచ్చితంగా పెళ్లి న్యూస్ అని అంటున్నారు అభిమానులు. చూడాలి మరి ప్రభాస్ ఎలాంటి గుడ్ న్యూస్ చెప్తాడో.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News