Pushpa-2 : ఇండియన్ సినిమా రికార్డులన్నీ బద్దలు కొడుతున్న అల్లు అర్జున్..!

Qubetvnews - December 9, 2024 / 04:05 PM IST

Pushpa-2 : ఇండియన్ సినిమా రికార్డులన్నీ బద్దలు కొడుతున్న అల్లు అర్జున్..!

Pushpa-2 : అల్లు అర్జున్ మేనియా మామూలుగా లేదు. చాలా రోజులుగా పుష్ప-2 ఫీవర్ ఏ రేంజ్ లో ఉందో చూస్తూనే ఉన్నాం. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన పుష్ప-2 అందుకు తగ్గట్టే దుమ్ము లేపుతోంది. తొలిరోజు అత్యధిక వసూల్లు సాధించిన ఇండియన్ సినిమాగా చరిత్ర సృష్టించింది. బాలీవుడ్ ఖాన్ లకు సైతం సాధ్యం కాని రికార్డులను నమోదు చేసింది. మొదటి రోజు ఏకంగా రూ.294 కోట్లు వసూలు చేసి బన్నీ సత్తా ఏంటో నిరూపించింది. ఈ మూవీ విడుదలైన నాలుగు రోజుల్లో ఏకంగా రూ.800 కోట్లు కొల్లగొట్టింది.

ఇప్పటి వరకు ఏ సినిమాకు కూడా ఇంత భారీగా వసూళ్లు సాధ్యం కాలేదు. ఎందుకంటే మూడు రోజుల్లోనే రూ.500 కోట్లు సాధించిన సినిమాగా పుష్ప-2 నిలిచింది. మరీ ముఖ్యంగా బాలీవుడ్ లో చాలా రికార్డులను బన్నీ బద్దలు కొట్టేశాడు. బాలీవుడ్ లో మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా పుష్ప-2నిలిచింది. ఇప్పటి వరకు హిందీ చరిత్రలోనే లేని విధంగా ఏకంగా రూ.72 కోట్లు రాబట్టింది. ఇప్పటి వరకు ఈ రికార్డు జవాన్ పేరిట రూ.65 కోట్లతో ఉండేది. కానీ దాన్ని పుష్ప ది రూల్ బ్రేక్ చేసి పడేసింది.

ఇదే ఒక ఎత్తు అయితే.. రెండో రోజు రూ.59 కోట్లు వసూలు చేయగా.. మూడో రోజు ఏకంగా రూ.74 కోట్లు వసూలు చేసింది. అంటే ఒకే సినిమా రెండు సార్లు హయ్యెస్ట్ వసూళ్లు సాధించి రెండో రికార్డును కూడా నమోదు చేసింది. ఇలా రోజు రోజుకూ కలెక్షన్లు పెరగడం అంటే ఇప్పటి వరకు షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లకు కూడా సాధ్యం కాలేదు. దాంతో బాలీవుడ్ స్టార్లు కూడా సాధ్యం కాని రికార్డులను అల్లు అర్జున్ సాధించి చూపించాడు. పుష్ప-2 జాతర ఇంకో రెండు రోజులు కొనసాగినా సరే ఈజీగా వెయ్యి కోట్ల వసూల్లు సాధించేస్తుందని చెబుతున్నారు.

పుష్ప-2కు పోటీగా ఇప్పట్లో బాలీవుడ్ లో పెద్ద సినిమాలు కూడా లేవు. పైగా ఫుల్ హైప్ ఉన్న సినిమా కాబట్టి.. చాలా మంది ఈ మూవీని థియేటర్లలోనే చూడాలని కోరుకుంటున్నారు. థియేటర్ ఎక్స్ పీరియన్స్ వేరే లెవల్ లో ఉందనే ప్రచారం జరుగుతోంది కాబట్టి.. దాన్ని మిస్ కావొద్దని చాలా మంది థియేటర్ల బాట పడుతున్నారు. ఆ లెక్కన మూవీ లాంగ్ రన్ లో రూ.2వేల కోట్లుసాధించినా ఆశ్చర్యపోనవసరం లేదని చెబుతున్నారు. అదే జరిగితే ఎవరికీ అందనంత పెద్ద స్టార్ గా అల్లు అర్జున్ అవతరిస్తాడని చెబుతున్నారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News