Rashmi Gautam : సీనియర్ నటుడితో రష్మీ రొమాన్స్.. లైవ్ ప్రోగ్రామ్ లో ఇదేం పాడు పని..!
Qubetvnews - February 17, 2024 / 11:02 AM IST
Rashmi Gautam :
ఈ నడుమ బుల్లితెర ప్రోగ్రామ్స్ కూడా కాస్త శృతిమించిపోతున్నాయి. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. కాగా అందులోనూ జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలు ఇంకాస్త బూతు డైలాగులతో రెచ్చిపోతున్నాయి. ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ అయితే ప్రస్తుతం బుల్లితెరపై టాప్ రేటింగ్స్ తో దూసుకుపోతోంది. ఇందులో అందరూ చూసే కామెడీ బాగానే పేలుతోంది. సుధీర్ వెళ్లిపోయిన తర్వాత ఈ షోకు రష్మీ యాంకర్ గా చేస్తోంది. అయితే అప్పుడప్పుడు ఈ షోలో చేసే శృతిమించిన రొమాంటిక్ సీన్లు, స్కిట్లు కాస్త చిరాకు పుట్టించేలా ఉంటాయి. ఇక టీఆర్పీ స్టంట్ల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు.
ఈ క్రమంలోనే తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ 150వ ఎపిసోడ్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. ఈ స్పెషల్ ఎపిసోడ్ కు సీనియర్ నటులు మురళీ మోహన్, జయసుధలు వచ్చారు. ఇక వారితో కామెడీ చేయించారు టీమ్ సభ్యులు. అంతే కాకుండా వారిని గౌరవించుకుని కాసేపు వారిని తమ కామెడీతో అలరించేశారు. ఈ షో అటెన్షన్ మొత్తం మురళీమోహన్ మీదనే స్పెషల్ గా నడిచింది. ఆయన వస్తూనే యాంకర్ రష్మీ మీద ప్రశంసలు కురిపించారు. ఆమె ను చూస్తుంటే హీరోయిన్ ను చూస్తున్నట్టే ఉందంటూ కామెంట్లు చేశారు మురళీ మోహన్. ఆమె మీద పరోక్షంగా పంచ్ లు కూడా వేశారు.
ఆమె అంటే తనకు క్రష్ అని వెల్లడించారు. ఒక ముంబయి హీరోయిన్ లాగా ఉంటుందని తెలిపారు. ఆమెకు తాను పెద్ద ఫ్యాన్ అంటూ తెలపడంతో అక్కడున్న వారంతా హో వేసుకున్నారు. అనంతరం షో మధ్యలో మురళీ మోహన్ కు సన్మానం చేశారు. హైపర్ ఆది ప్రశంసిస్తూ స్పీచ్ ఇచ్చాడు. మురళీ మోహన్ గొప్పతనాన్ని తెలిపాడు హైపర్ ఆది. ఆది స్పీచ్ అయిపోయాక రష్మీ రెచ్చిపోయింది. మురళీమోహన్ తో రొమాంటిక్ సాంగ్ చేసింది. అందగాడా అందగాడా.. అందాలన్నీ అందుకోరా.., అల్లుకోరా, గిల్లుకోరా.. అందమంతా నీదిరా.. అంటూ మురళీ మోహన్‌తోని రాసుకుని పుసుకునేలా డాన్స్ చేస్తూ రెచ్చిపోయింది.

Rashmi Gautam Done Romantic Song with Murali Mohan
ఇది షో మొత్తానికే హైలెట్ గా నిలిచింది. మొదట్లతో తనను పొగిడినందుకు రష్మీ ఇలా రొమాంటిక్ సాంగ్ తో రెచ్చిపోయింది. ఇందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోది. కాగా ఇది చూసిన వారంతా మరీ ఇలా ఉన్నారేంటి అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఒక ముసలాయనతో ఇలాంటి రొమాంటిక్ సాంగ్ ఏంటి అంటూ నెగెటివ్ కామెంట్లు పెడుతున్నారు.
ఇలాంటి చెత్త పీఆర్పీ స్టంట్లు చేయకండి అంటూ రష్మీని ట్రోల్ చేస్తున్నారు. నీకు అంత ముసలోడు ఎలా నచ్చాడు అంటూ ఇంకొందరు ఆడేసుకుంటున్నారు. ఇలా అందరూ కలిసి రష్మీని ఓ రేంజ్ లో నెగెటివ్ గా ట్రోల్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారిపోయింది. మొత్తానికి రష్మీ ఏదో అనుకుని డ్యాన్స్ చేస్తే చివరకు అది ఇంకేదో అయిపోయింది.
