Renuu Desai : మీమర్స్ చేసిన పనికి ఏడ్చేసిన పవన్ కూతురు.. రేణూ దేశాయ్ ఫైర్

Qubetvnews - June 26, 2024 / 09:18 AM IST

Renuu Desai : మీమర్స్ చేసిన పనికి ఏడ్చేసిన పవన్ కూతురు.. రేణూ దేశాయ్ ఫైర్

Renuu Desai : సోషల్ మీడియాలో ఈ నడుమ మీమ్స్ పేజీలు చాలా ఎక్కువ అవుతున్నాయి. అయితే ఏదో ఫన్ కోసం చేస్తున్నామనే భ్రమలో.. కొన్ని సార్లు వ్యక్తిగతంగా కించ పరిచే విధంగా మీమ్స్ చేస్తున్నారు మీమర్స్. మరీ ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు, రాజకీయ నేతలపై చేస్తున్న మీమ్స్ అయితే మరీ దారుణంగా ఉంటున్నాయి. ఇప్పుడు ఓ మీమర్ చేసిన పనికి ఏకంగా పవన్ కల్యాణ్‌ కూతురు ఏడ్చేసింది. ఇంకేముంది రేణూ దేశాయ్ ఫుల్ ఫైర్ అయిపోయింది. ఇలాంటి చెత్త మీమ్స్ ఎలా చేస్తారంటూ సోషల్ మీడియాలో పెద్ద పోస్టే పెట్టేసింది. మీమర్స్ ను ఏకి పారేసింది రేణూ దేశాయ్.

మొన్న పవన్ కల్యాణ్‌ ప్రమాణ స్వీకారం సందర్భంగా రేణూ దేశాయ్ పిల్లలు అకీరా, ఆద్యలు కూడా సంప్రదాయ బట్టల్లో ఆ వేడుకకు వెళ్లారు. అక్కడ పవన్ కల్యాణ్‌, అన్నా లెజినోవాతో కలిసి వారు ఓ ఫొటోను కూడా దిగారు. ఆ ఫొటోను కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేసి రేణూ దేశాయ్ మంచి ఛాన్స్ వదులుకుందని.. దురదృష్టవంతురాలు అంటూ పోస్టు చేశారు. ఇంకొందరేమో ఆ మధ్య మోడీతో అకీరా, పవన్ కల్యాణ్‌, అన్నా లెజినోవా కలిసి దిగిన ఫొటోను.. క్రాప్ చేసి అన్నా లెజినోవా కనిపించకుండా పవన్ కల్యాణ్‌, అకీరా నందన్ ఫొటోను మాత్రమే రేణూ దేశాయ్ పోస్టు చేసింది కదా..

మరి ఇప్పుడు మధ్యలో పవన్, అన్నా లెజినోవా ఉన్నారు.. రెండు వైపులా ఆద్య, అకీరా ఉన్నారు కాబట్టి.. దీన్ని ఎలా క్రాప్ చేస్తుంది అంటూ పోస్టు పెట్టారు. అయితే అది తన ఇన్ స్టాలో చూసిన ఆద్య ఏడ్చేసింది. తన తల్లి మీద ఇలాంటి మీమ్స్ పెట్టడంతో ఆమె ఎమోషనల్ అయిపోయింది. కాగా రేణూ దేశాయ్ ఇలాంటి మీమ్స్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. మీరంతా ఈ ఫొటోను ఎలా క్రాప్ చేసి పోస్ట్ చేస్తానంటూ మీమ్స్ వేస్తూ జోకులు పేల్చుతున్నారు దయచేసి మీకు కూడా ఒక కుటుంబం ఉందని గుర్తుంచుకోండి. ఈ రోజు ఉదయం నా కూతురు ఇన్ స్టాగ్రామ్ ఎక్స్ ప్లోర్ పేజీలో తన తల్లిని ఎగతాళి చేస్తూ అసభ్యకరమైన మీమ్ పేజీ రావడంతో చాలా ఏడ్చింది.

సెలబ్రిటీలను, రాజకీయ నాయకులను ఎగతాళి చేసే మీరంతా ఇంట్లో తల్లులు, అక్కాచెల్లెళ్లు, కూతుళ్లు కూడా ఉన్నారనే విషయం గుర్తుంచుకోవాలి. ప్రముఖుల ఇంటర్నెట్, సోషల్ మీడియా ఖాతాలు అందుబాటులో ఉన్నంత మాత్రాన ఇలా ఇష్టం వచ్చినట్టు వాటిపై మీమ్స్ చేయడం సిగ్గుచేటు. ఈ రోజు నా కూతురు అనుభవించిన బాధను గుర్తుంచుకోండి.. నా కూతురు కన్నీళ్లు మీకు చెడు కర్మను ఎలా ఇస్తాయో గుర్తుంచుకోండి. ఒక తల్లిగా నా శాపం మీకు తగులుతుంది అంటూ సంచలన పోస్టు చేసింది రేణూ దేశాయ్. దాంతో ఈ పోస్టు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాంతో రేణూ దేశాయ్ కు మద్దతుగా పవన్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి చెత్త మీమ్స్ క్రియేట్ చేయడం మంచిది కాదని చెబుతున్నారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News