Sandeep Kishan : ముగ్గురు అమ్మాయిలతో డీప్ లవ్ ఎఫైర్.. మొదటిసారి చెప్పేసిన సందీప్ కిషన్..!

Qubetvnews - February 17, 2024 / 07:40 AM IST

Sandeep Kishan : ముగ్గురు అమ్మాయిలతో డీప్ లవ్ ఎఫైర్.. మొదటిసారి చెప్పేసిన సందీప్ కిషన్..!

Sandeep Kishan :

ఈ నడుమ ఇండస్ట్రీలో చాలానే లవ్ ఎఫైర్లు నడుస్తున్నాయి. అయితే అందులో కొన్ని బయట పడుతుంటే మరికొన్ని మాత్రం అస్సలు బయట పడట్లేదు. ఇక మరీ ముఖ్యంగా హీరో, హీరోయిన్లు ప్రేమలో పడటం అనేది చాలా కామన్ అయిపోయింది. కొందరు ముందడుగు వేసి ఇంట్లో వారిని ఒప్పించి పెళ్లి చేసుకుంటున్నారు. కానీ కొందరు మాత్రం తమ రిలేషన్ ను మధ్యలోనే ఆపేస్తున్నారు. అలా ఆపేసిన తర్వాత గానీ వారి లవ్ ఎఫైర్లు ఎవరితో ఏంటి అనేది బయటకు చెప్పట్లేదు. ఇప్పుడు తాజాగా యంగ్ హీరో సందీప్ కిషన్ కూడా ఇలాగే తన లవ్ ఎఫైర్ ను బయట పెట్టేశాడు.

ఇది వినడానికి కూడా చాలా విడ్డూరంగా అనిపిస్తోంది. ఎందుకంటే ఇన్ని రోజులు సందీప్ కిషన్ అంటే ఓ క్లీన్ ఇమేజ్ ఉండేది. అందుకే ఆయన మీద పెద్దగా రూమర్లు రాలేదు. అయితే మొదటి సారి ఎవరూ అడగకుండానే ఆయనే తన గురించి మొత్తం ఓపెన్ అయిపోయాడు. సందీప్ కిషన్ ఓ మంచి హిట్ కొట్టి చాలా కాలం అవుతోంది. దాదాపు ఇండస్ట్రీలో ఆయన గ్రాఫ్‌ పూర్తిగా పడిపోతుంది. ఈ క్రమంలోనే ఆయన మరో ప్రయత్నంతో మన ముందుకు రాబోతున్నాడు. ఆయన నటించిన తాజా మూవీ ఊరు పేరు భైరవకోన. మొదటి సారి హర్రర్ సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు.

ఈ సినిమా ఫిబ్రవరి 16న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించారు. ఈ క్రమంలోనే వీరందరూ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. తాజా ఇంటర్వ్యూలో సందీప్ కిషన్ మాట్లాడుతూ తన లవ్ ఎఫైర్ల గురించి కూడా స్పందించాడు. ఆయన మాట్లాడుతూ నేను ఇన్ని రోజులు సింగిల్ గా లేను. ముగ్గురు అమ్మాయిలతో లాంగ్ రిలేషన్ లోనే ఉన్నాను. ఒక అమ్మాయితో నాలుగేళ్లు రిలేషన్ మెయింటేన్ చేశాను. ఇంకో అమ్మాయితో రెండేళ్లు, మూడో అమ్మాయితో రెండేళ్లు సీరియస్ రిలేషన్ లో గడిపేశాను.

అంత ఎక్కువ కాలం వారితో రిలేషన్ లో ఉన్నా సరే మా మధ్య ముందడుగు పడలేదు. కానీ ఇప్పుడు నేనున్న పొజీషన్ లో ప్రేమ అంత ఇంపార్టెంట్ కాదనిపిస్తోంది. మొదట కెరీర్ మీద దృష్టి పెట్టాలని అనుకుంటున్నాను. అందుకే ఇప్పుడు సినిమాల మీద ఫోకస్ పెట్టేశాను అంటూ చెప్పుకొచ్చాడు సందీప్.

చాలా కాలం తర్వాత ఆయన నుంచి ఓ సినిమా రాబోతోంది. ఈ సినిమాతో అయినా అతను హిట్ అందుకుంటాడని అంతా అనుకుంటున్నారు. మరి ఆయన మంచి హిట్ కొడితేనే కెరీర్ ఉంటుంది. లేదంటే మాత్రం ఆయనకు ఇక కెరీర్ లేనట్టే అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News