Sreeleela : బ్రెయిన్ లెస్ మొగుడు కావాలి.. ఆ పని కరెక్టుగా చేయాలంటున్న శ్రీలీల..!
Qubetvnews - February 17, 2024 / 07:19 AM IST
Sreeleela :
శ్రీలీల ఇప్పుడు టాలీవుడ్ లో ఓ సెన్సేషనల్ గా మారిపోయింది. వాస్తవానికి ఆమెకు ఉన్న గ్లామర్, అదృష్టానికి ఈ పాటికి స్టార్ హీరోయిన్ అయిపోవాల్సి ఉండే. కానీ ఎందుకో ఆమెకు అదృష్టం ఎంత ఉందో దురదృష్టం కూడా అంతే ఉన్నట్టు అనిపిస్తోంది. అందుకే ఆమె ఎంత త్వరగా పైకి ఎగసిపడిందో.. అంతే త్వరగా కిందకు పడిపోతుందని చెప్పుకోవాలి. ఆమె మొదట తెలుగులో పెండ్లి సందడి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ యావరేజ్ గానే ఆడింది. కానీ ఇంతలోనే ఆమెకు అదృష్టం వెతుక్కుంటూ వచ్చింది. ఎందుకంటే ఒకే సినిమా చేసినా కూడా యూత్ లో విపరీతమైన క్రేజ్ ఆమె సొంతం అయిపోయింది.
పైగా పెద్ద కులానికి చెందిన అమ్మాయి.. దానికి తోడు డ్యాన్స్ లు కూడా బాగానే చేస్తుంది. అందుకే ఆమెకు టాలీవుడ్ లో వరుస అవకాశాలు వచ్చాయి. రామ్ పోతినేనితో స్కంద సినిమా చేసింది. కానీ అది దారుణంగా డిజాస్టర్ అయిపోయింది. ఆ మూవీపై తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. దానికి ముందు నితిన్ తో చేసిన ఎక్స్ ఆర్డినరీ మ్యాన్ కూడా బెడిసికొట్టింది. ఇక పంజా వైష్ణవ్ తేజ్ తో చేసిన ఆదికేశవ సినిమా కూడా అట్టర్ ప్లాప్ అయింది. సరే ఇవన్నీ పోతే పోనీలే ఆమెకు సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన చేసిన గుంటూరు కారం సినిమా ఉంది కదా అని అంతా అనుకున్నారు.
ఆ మూవీ గనక హిట్ అయితే ఆమెకు తిరుగులేని స్టార్ డమ్ సొంతం అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఆ మూవీ కూడా ప్లాప్ అయిపోయింది. దాంతో శ్రీలీల ఆలోచనలో పడింది. ఇప్పుడు ఆమె చేతిలో పెద్దగా సినిమా ఛాన్సులు కూడా లేవు. దాంతో ఆచితూచి అడుగులు వేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే ఆమె తాజాగా ఒరిజినల్ అనే ఇంటర్వ్యూ ప్రోగ్రామ్ లో పాల్గొంది. దీన్ని సౌమ్య హోస్ట్ గా చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఇంటర్వ్యూకు వచ్చిన శ్రీలీలను ఆమె కొన్ని బోల్డ్ ప్రశ్నలు కూడా వేసింది. నీకు బ్రెయిన్ ఉన్న మొగుడు కావాలా.. ఫన్నీగా, జోవియల్ గా ఉండే మొగుడు కావాలా అని అడిగింది సౌమ్య.

Sreeleela Participated In Original Interview Program
దాంతో శ్రీలీల సమాధానం ఇస్తూ నాకు ఫన్నీగా, జోవియల్ గా ఉండే మొగుడే కావాలని చెప్పింది. బ్రోయిన్ తో చేసే పనులు తాను చూసుకుంటానని వివరించింది. ఇలా ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అంటే ఆమె ఒక రకంగా తనకు బ్రెయిన్ లెస్ మొగుడే కావాలని చెప్పిందన్నమాట.
ఇక ప్రస్తుతం చేతిలో ఎలాంటి సినిమాలు లేకపోవడంతో శ్రీలీల చాలా ఇబ్బందుల్లో పడిపోయింది. ఆమె ఇప్పుడు తమిళంలో కూడా కొన్ని సినిమాల్లో చేస్తుందనే టాక్ వినిపిస్తోంది. దాంతో పాటు కన్నడలో కూడా ఒక సినిమా ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. మరి చూడాలి అమ్మడి కెరీర్ ఉపు అందుకుంటుందా లేదా అనేది.
