Sukumar : రాజమౌళి భయాన్ని నిజం చేసిన సుకుమార్..!
Qubetvnews - December 12, 2024 / 05:26 PM IST
Sukumar : టాలీవుడ్ లో నెంబర్ వన్ డైరెక్టర్ ఎవరు అంటే అందరికీ టక్కున గుర్తుకు వచ్చే పేరు రాజమౌళి. తీసింది మిగతా దర్శకుల కంటే చాలా తక్కువ సినిమాలు. కానీ ఒక్కో సినిమా ఒక్కో చరిత్ర. ఆయన తీసిన ప్రతి మూవీ హిట్టే. చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగ రాసినవే. ఒక రకంగా చెప్పాలంటే జక్కన్న మూవీ రికార్డులను బద్దలు కొట్టాలంటే మళ్లీ జక్కన్నతోనే సాధ్యం. అందుకే జక్కన్న సినిమా అంటేనే విపరీతమైన హైప్ ఉంటుంది. హీరోలతో సంబంధం లేకుండా జక్కన్నను చూసే జనాలు థియేటర్లకు వెళ్తారు. అలాంటి జక్కన్నను ఎవరైనా కొడతారా అంటే.. కొట్టరనే చెబుతారు కదా.. కానీ తనను కూడా కొట్టేవాడు ఉన్నాడని గతంలోనే జక్కన్న చెప్పాడు.
ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో సరిగ్గా ఫోకస్ పెడితే చరిత్ర సృష్టించే సినిమాలు తీసే సత్తా ఇద్దరికి ఉంది. ఒకరు సుకుమార్, ఇంకొకరు త్రివిక్రమ్ శ్రీనివాస్. వారిద్దరు గనక కరెక్ట్ గా ఫోకస్ చేసి సినిమా తీస్తే నా పని అయిపోతుంది అన్నాడు జక్కన్న. ఇప్పుడు అదే విషయాన్ని సుకుమార్ నిజం చేసి చూపించాడని అంటున్నారు ప్రేక్షకులు. ఎందుకంటే సుకుమార్ పుష్ప సిరీస్ తో ఎలాంటి చరిత్ర సృష్టించాడో చూస్తున్నాం. బాహుబలి లాంటి విజువల్స్ లేకున్నా.. కేజీఎఫ్ లాంటి హైప్ ఎక్కించే కథ లేకున్నా.. ఒక ఎర్ర చందనం దొంగ కథతో ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేయడం అంటే మాటలు కాదు.
పైగా నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియా వరకు అన్ని వర్గాల ప్రేక్షకులను తన సినిమాతో మెప్పించాడు సుకుమార్. బడ్జెట్ భారీగా అయి ఉండొచ్చు గానీ.. కథ పరంగా, విజువల్స్ పరంగా పుష్ప-2కు చాలా మైనస్ లు ఉన్నాయి. అయినా సరే తన మేకింగ్, టేకింగ్, పుష్పరాజ్ మేనరిజంతో దేశాన్ని ఊపేశాడు సుకుమార్. జక్కన్న తర్వాత టాలీవుడ్ లో వెయ్యి కోట్ల సినిమా అంటే సుకుమార్ దే. కాబట్టి జక్కన్నకు సుకుమార్ గట్టి పోటీ అని చెప్పుకోవాలి. రంగస్థలం సినిమాకు ముందు సుకుమార్ వేరు.. ఇప్పుడు సుకుమార్ వేరు. ఆయన సినిమాలకు పాన్ ఇండియా వ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. కాబట్టి సుకుమార్ తలచుకుంటే జానపద కథలతో కూడా సినిమాలు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.
సుకుమార్ తలచుకుంటే మరో బాహుబలి లాంటి సినిమాను కూడా తీయగలడని ఆయన టేకింగ్ చూసిన వారు చెబుతున్నారు. సుకుమార్ ట్యాలెంట్ ను అందరికంటే ముందే ఊహించిన జక్కన్న.. చివరకు తన భయాన్ని నిజం చేశాడని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే పుష్ప-1 సినిమాను పాన్ ఇండియాలో రిలీజ్ చేయడానికి కూడా రాజమౌళినే కారణం. కాబట్టి రాజమౌళి స్థాయిలో సుకుమార్ సినిమాలు భవిష్యత్ లో తీస్తాడేమో వేచి చూడాలి.





