Director Krish Jagarlamudi : హరిమర వీరమల్లు నుంచి క్రిష్ తప్పుకున్నారా.. అసలేం జరుగుతోంది..?

Qubetvnews - February 17, 2024 / 08:51 AM IST

Director Krish Jagarlamudi : హరిమర వీరమల్లు నుంచి క్రిష్ తప్పుకున్నారా.. అసలేం జరుగుతోంది..?

Director Krish Jagarlamudi :

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ హీరోగా వచ్చే ఏ సినిమా కూడా ఇప్పటి వరకు ఆగిపోలేదు. కానీ హరిమర వీరమల్లు మాత్రం చాలా కాలాంగా పెండింగ్ లో పడింది. అది కూడా సంచలన దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న పీరియాడికల్ మూవీ. ఇప్పటి వరకు పవన్ కల్యాణ్‌ ఇలాంటి పాత్రలో నటించలేదు. దాంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. పవన్ కల్యాణ్‌ ఫస్ట్ లుక్, టీజర్లు ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి. దాంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ వెయిట్ చేశారు. మొఘ‌ల్ కాలంలో ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిల‌బ‌డిన ఓ బందిపోటు దొంగ పాత్ర‌నే ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేశారు.

ఇంత పెద్ద సినిమా కావడంతో భారీ బడ్జెట్ కూడా పెట్టారు. ఇందులో నిధి అగర్వాల్, బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ నటించారు. 2020లో మొదలైన ఈ సినిమా నాలుగేళ్లు అవుతున్నా ఇంకా రిలీజ్ కావట్లేదు. ఇప్పటి వరకు ఏ డైరెక్టర్ కూడా ఇంత టైమ్ తీసుకోలేదు. కానీ హరిహర వీరమల్లు సినిమా మాత్రం ఇంకా రిలీజ్ కాకుండా నాన్చుతోంది. ఈ సినిమాకు కోవిడ్ టైమ్ లో గ్యాప్ వచ్చింది. ఆ సమయంలో కొండ పొలం సినిమా తీశాడు క్రిష్‌. అంతే కాకుండా మధ్యలో ఓ వెబ్ సిరీస్ కూడా తీశాడు. కానీ హరిహర వీరమల్లు మాత్రం ఇంకా షూటింగ్ కంప్లీట్ కాలేదు.

హరిమర వీరమల్లు తర్వాత పవన్ కల్యాణ్‌ ఒప్పుకున్న సినిమాలు అన్నీ కంప్లీట్ చేస్తున్నాడు. భీమ్లానాయక్, బ్రో సినిమాలు ఈ మూవీ తర్వాత ఒప్పుకున్నవే. అంతెందుకు ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలు ఈ సంవత్సరంలో షూటింగ్ స్టార్ట్ అయ్యాయి. అలాంటి ఈ రెండు సినిమాలు దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ డేట్స్ కూడా అనౌన్స్ చేశాయి. కానీ హరిహర వీరమల్లు మాత్రం ఇంకా రిలీజ్ కాకుండా ఆగిపోయింది. కాగా అందుతున్న సమాచారం ప్రకారం తాజాగా ఈ మూవీ నుంచి డైరక్టర్ క్రిష్ బయటకు వచ్చేసినట్లు సమాచారం అందుతోంది.

అనుకున్న టైమ్ కు మూవీని కంప్లీట్ చేయడంలో క్రిష్ ఫెయిల్ అయ్యాడని.. పైగా ఇప్పటి వరకు చేసిన షూటింగ్ ఔట్ ఫుట్ కూడా పవన్ కు నచ్చలేదని తెలుస్తోంది. అంతే కాకుండా రీషూట్ పెట్టినా వారు ఒప్పుకోవట్లేదంట. పవన్ కు, క్రిష్ కు మధ్య క్రియేటివ్ విషయంలో తేడాలు వచ్చినట్టు తెలుస్తోంది.

 Talk Director Krish Jagarlamudi Left Hari Hara Veeramallu

Talk Director Krish Jagarlamudi Left Hari Hara Veeramallu

కాకపోతే నిజంగానే క్రిష్‌ తప్పుకున్నాడా లేదా అనేది మాత్రం తెలియదు. కాకపోతే సినిమా షూటింగ్ ఆగిపోయి చాలా కాలం అవుతోంది. ఇంకో పక్క క్రిష్‌ వేరే సినిమా చేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. మరి ఇప్పటికే భారీగా ఖర్చు పెట్టి సినిమా షూటింగ్ చేశారు నిర్మాత ఏఎం రత్నం. ఇది ఆయనకు పెద్ద దెబ్బే అని చెప్పుకోవాలి. మరి ఇంత ఖర్చు పెట్టిన తర్వాత సినిమాను ఆపేస్తారా లేదంటే వేరే డైరెక్టర్ వచ్చి మూవీని కంప్లీట్ చేస్తారా అనేది వేచి చూడాలి.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News