Rave Party : రేవ్ పార్టీలో టాలీవుడ్ సెలబ్రిటీలు.. అడ్డంగా దొరికిపోయిన హేమ.. మేం కాదంటూ కొందరి వీడియోలు..!

Qubetvnews - May 20, 2024 / 05:52 PM IST

Rave Party : రేవ్ పార్టీలో టాలీవుడ్ సెలబ్రిటీలు.. అడ్డంగా దొరికిపోయిన హేమ.. మేం కాదంటూ కొందరి వీడియోలు..!

Rave Party : బెంగుళూరు రేవ్ పార్టీ ఇప్పుడు టాలీవుడ్ ను కుదిపేస్తోంది. ఎందుకంటే ఈ పార్టీలో చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీలు పాల్గొన్నారని.. వారంతా ఇప్పుడు పోలీసులకు దొరికిపోయారనే వార్తలు సంచలనం రేపుతున్నాయి. ఇంతకీ ఎవరెవరు దొరికారు అనే దానిపై అందరూ ఆరా తీస్తున్నారు. అసలు రేవ్ పార్టీలో దొరికింది ఎవరు, ఎవరెవరు వెళ్లారు అనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటికే కొందరి పేర్లు బయటకు వచ్చాయి. అయితే అందులోని కొందరు మేం కాదంటే మేం కాదంటూ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. అసలు ఈ రేవ్ పార్టీ జరిగింది బెంగుళూరులో.

బెంగుళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ పక్కనే ఉండే జీఆర్ ఫామ్ హౌస్ లో బర్త్ డే పార్టీ పేరుతో దీన్ని నిర్వహించారు. ఈ జీఆర్ ఫామ్ హౌస్ హైదరాబాద్ కు చెందిన గోపాల్ రెడ్డిది. ఇందులో దాదాపు వందమందికి పైగా పాల్గొన్నారంట. 70 మంది అబ్బాయిలు, 30 మంది అమ్మాయిలు పాల్గొన్నారని తెలుస్తోంది. అందులో టాలీవుడ్ సెలబ్రిటీలే ఎక్కువగా ఉన్నట్టు కన్నడ మీడియా ద్వారా తెలుస్తోంది. అయితే తెల్లవారు జామున 3 గంటల వరకు జరిగిన ఈ పార్టీ గురించి బెంగుళూరు పోలీసులకు పక్కా సమాచారం రావడంతో వారంతా దాడులు నిర్వహించారు.

ఈ దాడుల్లో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఆ పార్టీలో వాడిన కొకైన్, డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పార్టీలో పాల్గొన్న వారందరినీ అరెస్ట్ చేశారు. కాగా ఇందులో పట్టుబడ్డ వారిలో ముందుగా నటి హేమ పేరు బయటకు వచ్చింది. అయితే వెంటనే హేమ ఓ వీడియో రిలీజ్ చేసింది. ఆ పార్టీలో తాను లేనని.. ఇది హైదరాబాద్ లోని నా ఫామ్ హౌస్ ఇక్కడే ఎంజాయ్ చేస్తున్నా అంటూ ఓ వీడియో వదిలింది. అయితే ఇక్కడే హేమ అడ్డంగా బుక్కైపోయింది. ఆమె ఆ రేవ్ పార్టీలోనే ఉందని పోలీసులు కన్ఫర్మ్ చేసేశారు. ఆమె వీడియోలో ఉన్న డ్రెస్ లోనే పార్టీలో పాల్గొందని తెలుస్తోంది.

పైగా ఆమె జీఆర్ ఫామ్ హౌస్ లోనే పక్కకు వెళ్లి హైదరాబాద్ లో ఉన్నట్టు వీడియో చేసిందని చెబుతున్నారు. దాంతో హేమ అడ్డంగా దొరికిపోయింది. ఇక హీరో శ్రీకాంత్ పేరు కూడా ఇందులో వినిపించడంతో ఆయన కూడా ఓ వీడియోను వదిలారు. హైదరాబాద్ లోని తన ఇంట్లో ఉన్న వీడియోను వదిలి.. నేను రేవ్ పార్టీలకు వెళ్లే వ్యక్తిని కాదంటూ తెలిపారు. తన లాగే ఉండే ఓ వ్యక్తి అందులో ఉన్నారని.. అందుకే మీడియా తప్పుగా అర్థం చేసుకుని నా పేరు రాసిందంటూ స్పష్టం చేశారు.

జానీ మాస్టర్ పేరు కూడా వినిపించినా దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఆయన కూడా దానిపై స్పందించలేదు. ఇక రేవ్ పార్టీలో అరెస్ట్ అయిన వారి రక్త నమూనాలను, హెయిర్‌ శాంపిల్స్‌ సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు. ఈ రోజు సాయంత్రంలోగా పూర్తి సమాచారం రాబోతోంది. ఎవరెవరు పాల్గొన్నారు, అందులో టాలీవుడ్ సెలబ్రిటీలు ఎవరున్నారనేది తెలిసిపోనుంది.

 

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News