Allu Aravind : బన్నీ కోసం రామ్ చరణ్‌ కు పోటీ ఇస్తున్న అల్లు అరవింద్.. నిజమేనా..?

Qubetvnews - October 17, 2024 / 10:26 AM IST

Allu Aravind : బన్నీ కోసం రామ్ చరణ్‌ కు పోటీ ఇస్తున్న అల్లు అరవింద్.. నిజమేనా..?

Allu Aravind : మెగా వార్ ఇప్పుడు ఏ రేంజ్ లో ఉందో అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో అల్లు అర్సెస్ మెగా వార్ ను నడిపిస్తున్నారు ఇరువురి అభిమానులు. ముఖ్యంగా అల్లు అర్జున్ మీద వస్తున్న ట్రోల్స్ అన్నీ ఇన్నీ కావు. మొన్న ఎలక్షన్ల సమయంలో ఈ వార్ కాస్త పీక్స్ కు వెళ్లింది. బన్నీ వెళ్లి వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలపడంతో అగ్గి రాజుకుంది. పైగా పవన్ ను ఇప్పటి వరకు కలవలేదు. ఈ క్రమంలోనే పుష్ప-2 వాయిదా పడటంతో.. పవన్ దెబ్బకు వాయిదా వేసుకున్నాడు అంటూ పెద్ద ఎత్తున ట్రోలింగ్ మొదలైంది. ఎట్టకేలకు డిసెంబర్-6న రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ ప్రకటించారు.

కాగా మొన్నటి వరకు గేమ్ ఛేంజర్ మూవీ కూడా క్రిస్మస్ కే వస్తుందనే టాక్ నడిచినా.. దాన్ని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు దిల్ రాజు చెప్పారు. విశ్వంభరను వాయిదా వేయించి మరీ రిలీజ్ చేస్తున్నారు. దాంతో పుష్ప-2కు లైన్ క్లియర్ అయిందని అంతా అనుకున్నారు. అయితే ఇప్పుడు తండేల్ మూవీ అడ్డంకిగా మారిందంట. నాగచైతన్య, సాయిపల్లవి కాంబోలో వస్తున్న ఈ మూవీపై భారీ బజ్ క్రియేట్ అయింది. పైగా అల్లు అరవింద్ నిర్మాతగా ఉండటంతో హిట్ గ్యారెంటీ అని భావిస్తున్నారు. దాంతో ఈ మూవీని ముందు డిసెంబర్ 20కే రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు.

అయితే పుష్ప-2కు పోటీగా ఉండొద్దని అల్లు అరవింద్ భావిస్తున్నారంట. అందుకే ఈ మూవీని సంక్రాంతికి పోస్ట్ పోన్ చేసినట్టు చెబుతున్నారు. తండేల్ మూవీని సంక్రాంతికే రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అయితే సంక్రాంతికి గేమ్ ఛేంజర్ మూవీ ఉంది. పైగా బాలయ్య 109బీకే మూవీ, వెంకటేశ్-అనిల్ రావిపూడి మూవీలు కూడా పోటీపడుతున్నాయి. కానీ ఆ రెండింటికంటే తండేల్ మూవీ మీదనే భారీ బజ్ ఉంది. కాబట్టి ఈ సినిమాను గనక సంక్రాంతికి రిలీజ్ చేస్తే కచ్చితంగా గేమ్ ఛేంజర్ సినిమాపై భారీ ప్రభావం పడుతుందని అంటున్నారు.

అల్లు అరవింద్ సంక్రాంతికి రిలీజ్ చేస్తే కచ్చితంగా రామ్ చరణ్ కు పోటీ ఇచ్చినట్టే చెబుతున్నారు. బన్నీ కోసం రామ్ చరణ్ మూవీని రిస్క్ లో పెడతారా అంటూ ఓ వైపు సోషల్ మీడియాలో మెగా ఫ్యన్స్ నానా హంగామా చేస్తున్నారు. ఒకవేళ నిజంగానే రిలీజ్ చేస్తే మాత్రం మెగా వార్ మరింత పీక్స్ కు వెళ్లడం గ్యారెంటీ.

ఇన్ని రోజులు బన్నీని మాత్రమే టార్గెట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్.. ఇప్పటి నుంచి అల్లు అరవింద్ ను కూడా అందులోనే కలిపేస్తారు. మరి ఎంతో అనుభవం, నేర్పు ఉన్న అరవింద్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది అందరికీ ఆతృతగా ఉన్న అంశం. ఈ విషయంలో అరవింద్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News