Lady Producer : కెమెరా అసిస్టెంట్ తో లేడీ నిర్మాత అక్రమ సంబంధం.. చివరకు ట్విస్టు మామూలుగా లేదే..!

Qubetvnews - February 17, 2024 / 08:40 AM IST

Lady Producer : కెమెరా అసిస్టెంట్ తో లేడీ నిర్మాత అక్రమ సంబంధం.. చివరకు ట్విస్టు మామూలుగా లేదే..!

Lady Producer :

సినిమా ఇండస్ట్రీలో ఈ నడుమ మోసాలు మరీ ఎక్కువ అయిపోతున్నాయి. ఇంకా చెప్పాలంటే అక్రమ సంంధాలకు కొదువే ఉండట్లేదు. పైగా వాటికి కమిట్ మెంట్లు అనే పేర్లు కూడా పెట్టుకుంటున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్లు, మేనేజర్లు లాంటి వారు కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే నటీమణులకు ఛాన్సులు ఇప్పిస్తామని చెప్పి వారిని లైంగికంగా  వేధించడం, తర్వాత వాడుకుని వదిలేయడం లాంటివి కూడా ఎన్నో చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు ఓ లేడీ నిర్మాత వ్యవహారం సంచలనంగా మారిపోయింది. ఆమె ఓ కెమెరా అసిస్టెంట్ కి పెద్ద టోపీ పెట్టేసింది. దాంతో బాధితుడు ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

అసలు విషయం ఏంటంటే భైరవ పురం సినిమాకు గతంలో నిర్మాతగా ఆశా మల్లిక వ్యవహరించారు. ఆ సమయంలోనే ఆ సినిమాకు కెమెరా అసిస్టెంట్ గా పని చేసిన నాగార్జున బాబుపై కన్నేసింది ఆశా మల్లిక. అతనితో పరిచయం పెంచుకుంది. ఇద్దరూ కలిసి అప్పుడప్పుడు బయట కలుసుకునేవారు. ఈ క్రమంలోనే తన ఇంటికి ఓ రోజు డిన్నర్ కు పిలిచింది ఆశా మల్లిక. నాగార్జునను మెల్లిగా మాటల్లో పెట్టేసి అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇద్దరూ కలిసి బాగానే ఎంజాయ్ చేశారు. దాంతో ఓ రోజు ఆమె ఫోన్ చేసి తాను ప్రెగ్నెంట్ అని చెప్పింది.

అయితే తనకు ఆల్రెడీ పెళ్లి అయిందని భర్త నుంచి విడాకులు తీసుకుంటాను.. మనం ఇద్దరం పెళ్లి చేసుకుందామని చెప్పింది. దానికి నాగార్జున బాబు కూడా ఓకే అన్నాడు. ఇద్దరూ కలిసి ఎవరికీ తెలియకుండా చిలుకూరు బాలాజీ టెంపుల్ లో పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి తర్వాత మల్లిక తనకు డబ్బులు కావాలని నాగార్జున బాబును కోరింది. దాంతో అతను ఒకసారి 18,50,000, మరోసారి 10 లక్షలు ఆమె అకౌంట్ లో వేశాడు. డబ్బులు చేతికి అందిన తర్వాత అతనిని దూరం పెట్టడం స్టార్ట్ చేసింది మల్లిక. దాంతో అతనికి అనుమానం వచ్చింది. ఆమె గురించి ఆరా తీయడం స్టార్ట్ చేశాడు.

అప్పుడే మల్లిక గురించి షాకింగ్ నిజాలు బయట పెట్టింది. ఎందుకంటే ఆమెకు ఒక పెళ్లి కాదు ఇంతకు ముందే మూడు పెళ్లిళ్లు అయ్యాయంట. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. గతంలో ఇలాగే ముగ్గురిని పెళ్లి చేసుకుని డబ్బులు తీసుకోవడం, ఆస్తిలో వాటాలు అడగడం చేస్తుండేదంట.

ఇతరులతో అక్రమ సంబంధాలు పెట్టుకుని వారిని పెళ్లి చేసుకుని ఆస్తిలో వాటాలు అడగడం లేదంటే డబ్బులు డిమాండ్ చేయడం లాంటి మోసాలకు పాల్పడేది. ఈ విషయం తెలుసుకున్న నాగార్జున బాబు తాను మోసపోయినట్టు గుర్తించి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశాడు. ఆమెపై గతంలో కూకట్ పల్లి, వైజాగ్ గాజువాకలో కూడా రెండు కేసులు ఉన్నట్టు తెలిసింది.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News