Revanth Reddy : రేవంత్ ప్లాన్ వర్కౌట్.. మజ్లిస్ సపోర్టు దొరికినట్టేనా..?

Qubetvnews - February 17, 2024 / 06:58 AM IST

Revanth Reddy : రేవంత్ ప్లాన్ వర్కౌట్.. మజ్లిస్ సపోర్టు దొరికినట్టేనా..?

Revanth Reddy :

రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ప్రతి విషయంలో కాంగ్రెస్ ను అగ్రగామిలో నిలిపేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఒకప్పుడు కాంగ్రెస్ తో ఏయే పార్టీలు, ఏయే వర్గాలు మిత్ర పక్షంగా ఉండేవో వాటన్నింటినీ మళ్లీ అక్కున చేర్చుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు వైఎస్సార్ హయాంలో ఏయే వర్గాలు కాంగ్రెస్ కు మిత్ర పక్షంగా ఉండేవో వాటిని గుర్తించి మరీ దగ్గరకు చేర్చుకుంటున్నారు. ఇందులో భాగంగా ఒకప్పుడు మజ్లిస్ పార్టీ కాంగ్రెస్ కు మిత్ర పక్షంగా ఉండేదనే చెప్పుకోవాలి.

కానీ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో కేసీఆర్ కు మజ్లిస్ పార్టీ దగ్గరైంది. అప్పటి నుంచి కేసీఆర్ కే మద్దతు ఇస్తూ వస్తుంది ఆ పార్టీ. అయితే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవం త్ రెడ్డి ముస్లిం ఓటర్లపై గురి పెట్టారు. ఇందులో భాగంగా మజ్లిస్ పార్టీని అక్కున చేర్చుకోవాలని ప్లాన్ వేశారు. అనుకున్నట్టు గానీ మొదటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రొటెం స్పీకర్ గా అసదుద్దీన్ ఓవైసీని నియమించారు. వాస్తవానిక ప్రొటెం స్పీకర్ గా కేసీఆర్ ను నియమించాలి కానీ ఆయన తుంటి ఆపరేషన్ వల్ల అసెంబ్లీకి రాలేకపోయారు. ఆ అవకాశాన్ని రేవంత్ రెడ్డి చక్కగా వినియోగించుకున్నారు.

అలా అసదుద్దీన్ ఓవైసీనం ప్రొటెం స్పీకర్ గా చేసి మజ్లిస్ కు దగ్గరయ్యారు. అప్పటి నుంచి మజ్లిస్ పార్టీని ఆయన అన్ని విషయాల్లో దగ్గరకు చేసుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే రేవంత్ వేస్తున్న ప్లాన్ వర్కౌట్ అయినట్టు తెలుస్తోంది. మజ్లిస్ పార్టీ కూడా కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చేందుకు సిద్ధపడిందని తేలిపోయింది. మొన్న రేవంత్ రెడ్డి మేడిగడ్డను సందర్శించడం కోసం అన్ని పార్టీలను ఆహ్వానించారు. కానీ ఈ సందర్శనకు బీఆర్ఎస్, బీజేపీ దూరంగా ఉన్నాయి. కానీ కాంగ్రెస్ తో పాటు ఎంఐంఎం పార్టీ ఎమ్మెల్యేలు ఆ సందర్శనకు వెళ్లారు.

Revanth Reddy Along MLAs Of AIMIM Party Go Medigadda Barrage

Revanth Reddy Along MLAs Of AIMIM Party Go Medigadda Barrage

దాంతో బీఆర్ఎస్ కు షాక్ తగిలినట్టు అయిపోయింది. ఎందుకంటే మొన్నటి వరకు ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్ కు మద్దతుగా ఉండేది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ కు మద్దతు పలుకుతోంది. ఒక రకంగా ఇది బీఆర్ఎస్ కు షాకింగ్ అనే చెప్పుకోవాలి. ఇది కాంగ్రెస్ కు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంతో కొంత మేలు చేసే అంశమే.

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ముస్లిం ఓటర్లు కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం ఓటర్లు బాగానే ఉన్నారు. కాబట్టి వారిని కాంగ్రెస్ మచ్చిక చేసుకోవాలని ప్లాన్ వేసింది. ఇది ఆ పార్టీకి బాగానే వర్కౌట్ అయ్యే అంశం అని చెప్పుకోవాలని అంటున్నారు రాజకీయ నిపుణులు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News