BJP : కవిత విషయంలో సీబీఐ దూకుడు.. టీబీజేపీకి కలిసొచ్చే అంశమేనా..?

Qubetvnews - February 24, 2024 / 09:23 AM IST

BJP : కవిత విషయంలో సీబీఐ దూకుడు.. టీబీజేపీకి కలిసొచ్చే అంశమేనా..?

BJP :

తెలంగాణ బీజేపీ గ్రాఫ్‌ రోజు రోజుకూ పెరుగుతోంది. అయితే బండి సంజయ్ హయాంలో దూసుకుపోతున్న బీజేపీకి దేశ నాయకత్వం ఒక్క సారిగా బ్రేకులు వేసింది. సంజయ్ ను రాష్ట్ర అధ్యక్షుడిగా తప్పించి కిషన్ రెడ్డిని పెట్టేసింది. సరిగ్గా ఎన్నికల ముంగిట ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పెద్ద దెబ్బ కొట్టింది బీజేపీ పార్టీని. దాంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పెద్ద దెబ్బ పడింది. పైగా ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అయిన రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు కూడా బాగానే పనిచేశాయి. రేవంత్ రెడ్డి ప్రధాన ఆరోపణ ఏంటంటే బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని.

అయితే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలను బీజేపీ బలంగా ఎదుర్కోలేకపోయింది. ఆ ఆరోపణలను తిప్పి కొట్టడంతో తీవ్రంగా విఫలం అయింది బీజేపీ పార్టీ. దాంతో ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో పాటు బీజేపీ కూడా బాగానే నష్టపోయింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ ఈ విషయంపై ఎంతో కొంత స్పందించే ప్రయత్నాలు చేస్తున్నా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే ఇప్పుడు ముందు ఎంపీ ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి వాటిని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రధానంగా ఇవ్వే ఆరోపణలు చేస్తున్నారు.

బీజేపీ బీఆర్ ఎస్ ఒక్కటి కాకపోతే ఇన్ని రోజులు ఎందుకు కాళేశ్వరం అవినీతిపై విచారించలేదని ప్రశ్నిస్తున్నారు. అంతే కాకుండా కవితపై కూడా కేసులు ముందుకు వెళ్లలేదని.. దీని వెనకాల బీజేపీ, బీఆర్ఎస్ రహస్య ఒప్పందాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి పదే పదే ఆరోపిస్తున్నారు. అయితే వీటికి టీబీజేపీ నేతలు కూడా బాగానే చెక్ పెట్టాలని ప్రయత్నాలు చేసినా పెద్దగా ప్రజల్లోకి వెళ్లట్లేదు. కాగా తాజాగా సీబీఐ తీసుకున్న నిర్ణయం బీజేపీకి ప్లస్అయ్యేలా ఉంది. కవితను ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితురాలిగా చేర్చింది సీబీఐ. ఈ నెల 26న మరసారి విచారణకు రావాలంటూ ఆదేశాలు ఇచ్చింది.

ఈ చర్యలు ఇప్పుడు బీజేపీ ప్రచారానికి బలం చేకూరుస్తున్నాయి. ఇన్ని రోజులు బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు ఇలా చెక్ పడింది. బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తులు పెట్టుకోలేదని.. అలాంటి పార్టీతో ఎవరూ కలవరని దానికి కవితపై తీసుకుంటున్న చర్యలేసాక్ష్యం అని చెప్పేందుకు అవకాశం దొరికింది.

BJP Put Check On Allegations By Congress Leaders

BJP Put Check On Allegations By Congress Leaders

ఎంపీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించాలని బీజేపీ టార్గెట్ గాపెట్టుకుంది. కాబట్టి ఎంపీ ఎన్నికల్లో మరోసారి దెబ్బ పడకుండా బీఆర్ఎస్ తో తమకు ఎలాంటి సంబంధాలు లేవని చెప్పేందుకు మంచి ఛాన్స్ దొరికింది. దీన్ని బీజేపీ నేతలు సరిగ్గా వాడుకుంటే ఎంపీ ఎన్నికల్లో కచ్చితంగా లాభం చేకూరే అవకాశాలు ఉన్నాయి.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News