KCR : తెలంగాణ సెంటిమెంటే కావాలి.. కేసీఆర్ యూటర్న్..!

Qubetvnews - April 7, 2024 / 10:30 AM IST

KCR : తెలంగాణ సెంటిమెంటే కావాలి.. కేసీఆర్ యూటర్న్..!

KCR : కేసీఆర్ కు తెలంగాణ సెంటిమెంట్ కలిసి వచ్చినంతగా ఇంక ఏదీకలిసి రాదనే విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఆ సెంటిమెంట్ తోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ఆ తర్వాత రెండుసార్లు అధికారంలోకి రావడం కోసం కూడా తెలంగాణ సెంటిమెంట్ ను బలంగా వాడుకున్నారు. ఇందుకోసం ఆయన వేయని ఎత్తుగడలు లేవనేది అందరికీ తెలిసిందే. గత 2018 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ టీడీపీతో పొత్తులు పెట్టుకుంది. ఆ సమయంలో కేసీఆర్ చాణక్యం బయటకు తీశారు. తెలంగాణ సెంటిమెంట్ ను ఆ ఎన్నికల్లో బలంగా రగిల్చారు.

దాంతో దెబ్బకు కేసీఆర్ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించింది. ఆ తర్వాత కేసీఆర్ తెనక్కు తిరిగి చూసుకోకుండా ఐదేండ్లు పరిపాలించారు. ప్రతి ఎన్నికల్లో ఆయన తెలంగాణ సెంటిమెంట్ ను రగిలిస్తే.. తెలంగాణ ప్రజలు ఆయన్ను ఓన్ చేసుకున్నారు. కానీ ఎప్పుడైతే కేసీఆర్ టీఆర్ ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చారో.. అప్పటి నుంచి ఆయన తెలంగాణ సెంటిమెంట్ ను పక్కన పెట్టేశారు. ఎంతసేపు దేశ రాజకీయాల్లో ప్రాతినిధ్యం వహిస్తాము.. బీఆర్ ఎస్ పార్టీ కేంద్రంలో చక్రం తిప్పుతుంది అంటూ చెప్పుకొచ్చారు. దాంతో తెలంగాణ ప్రజల్లో ఆయన పట్ల సెంటిమెంట్ భావం లేకుండా పోయింది.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తెలంగాణ సెంటిమెంట్ ను వాడుకోలేదు. కేవలం కాంగ్రెస్ మీద విమర్శలకు సరిపోయారు. దాంతో ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బీఆర్ ఎస్ దారుణంగా ఓడిపోయింది. దాంతో కేసీఆర్ ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ ఎస్ ఉంటే తెలంగాణ ప్రజలు ఓన్ చేసుకోరు అని ఆయనకు అర్థం అయిపోయింది. దాంతో ఇప్పుడు ఆయన యూటర్న్ తీసుకున్నట్టు అర్థం అవుతోంది. బీఆర్ ఎస్ ఉంటే వర్కౌట్ కావట్లేదు కాబట్టి.. తిరిగి పార్టీ పేరును టీఆర్ ఎస్ గా మార్చాలని ఆయన డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.

ఇందుకోసం ఇప్పటి నుంచే హింట్ ఇస్తున్నారు. తన పార్టీ నేతలతో ఆ విషయాన్ని ప్రజలకు వివరిస్తున్నారు. ఇందులో భాగంగానే మొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. బీఆర్ ఎస్ ను టీఆర్ ఎస్ గా మార్చేందుకు ఆలోచిస్తున్నాం అని తెలిపారు. అయితే కేసీఆర్ ఇలా ముందే హింట్ ఇవ్వడం వెనకాల కూడా ఓ ప్లాన్ ఉన్నట్టు తెలుస్తోంది.

అదేంటంటే ముందే ప్రజల నాడి ఎలా ఉందో తెలుసుకుంటే.. దానికి అనుగుణంగా పార్టీ పేరు మార్పుపై నిర్ణయం తీసుకోవచ్చన్నది ఆయన ప్లాన్. అందుకే ఇలా తన పార్టీ నేతలతో ప్రజలకు తెలియజేస్తున్నారు. ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తలు టీఆర్ ఎస్ కే జై కొడితే అప్పుడు పార్టీ పేరుపై మార్పు చేయాలని చూస్తున్నారు.

 

 

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News