KTR : ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలకు కేటీఆర్ కౌంటర్లు.. ఇలా చెక్ పెడుతున్నారా..?
Qubetvnews - March 28, 2024 / 12:27 PM IST
KTR : బీఆర్ ఎస్ పార్టీ ఓడిపోయినప్పటి నుంచే కష్టాలు మొదలయ్యాయి ఆ పార్టీ నేతలకు. ఎందుకంటే ప్రతి విషయాన్ని బయటకు లాగుతోంది కాంగ్రెస్ పార్టీ. చిన్న తప్పు దొరికినా సరే వదలకుండా డొంక మొత్తం బయటకు లాగుతున్నారు. ఇప్పటికే కాలేశ్వరంలో అవినీతి అంటూ నానా రచ్చ చేశారు. దాంతో పాటు మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడంపై పెద్ద ఎత్తున ప్రచారం చేసి ప్రజల్లో చర్చకు తెరలేపారు. ఇన్ని చేసిన తర్వాత ఇప్పుడు బీఆర్ ఎస్ ను వణికిస్తున్న మరో విషయ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. ఫోన్ ట్యాపింగ్ తో చాలా దుమారం రేగుతోంది. బీఆర్ ఎస్ హయాంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి.
ఇప్పటికే చాలా మందిని విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ఇంటెలిజెన్స్ బ్యూ మాజీ చీఫ్ ను కూడా ఈ విషయంలో లుక్ ఔట్ నోటీసులు జారీచేశారు. ఇలా బీఆర్ ఎస్ ను ఈ విషయంలో టార్గెట్ చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే దానిపై కేటీఆర్ ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ చేస్తున్న ఈ ఆరోపణలకు ఆయన చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే కేటీఆర్ మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఏదో అంతర్జాతీయ కుంభకోణంగా చూస్తున్నారు. గతంలో ఎన్నడూ జరగనంత పెద్ద స్కామ్ జరిగినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం హడావిడి చేస్తోంది.
కాంగ్రెస్ ఈ ఫేక్ వ్యవహారాన్ని బయటకు తీయడానికి అసలు కారణం వేరే ఉంది. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే ఇదంతా చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా ఉండేందుకే ఇలా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరమీదకు తెస్తుననారంటూ మండిపడ్డారు కేటీఆర్. ఇదే సమయంలో పదిలక్షల ఫోన్లను కేసీఆర్ ట్యాప్ చేశారంటూ లీకులు ఇస్తూ ప్రజలను డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని నిప్పులు చేరిగారు. రాష్ట్రంలో చాలా సమస్యలు పెండింగ్ లో ఉండిపోయాయి. కాంగ్రెస్ వచ్చాక సమస్యలు ఎక్కువ అవుతున్నాయి.
కానీ వాటి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు కాంగ్రెస్ ఇలాంటి ఎత్తుగడ వేస్తోంది అంటూ కేటీఆర్ మండిపడ్డారు. .. ప్రభుత్వంలో ఉన్నది రేవంత్ రెడ్డే కాబట్టి.. లీకులు ఆపి చర్యలు తీసుకోవాలని సూచించారు. తప్పు జరిగితే ఎవరూ ఉపేక్షించరు. దాన్ని నేను కూడా ఒప్పుకుంటాను.
ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్ ను ఆయ డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోండి.. దాన్ని నేను కాదనను. తప్పు ఎక్కడ జరిగిందో గుర్తించండి అంటూ కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.





