Danam Nagender : రూ.30 కోట్ల విలువైన భూ కబ్జా.. దానం నాగేందర్ భూ దాహం..!

Qubetvnews - March 17, 2024 / 08:09 AM IST

Danam Nagender : రూ.30 కోట్ల విలువైన భూ కబ్జా.. దానం నాగేందర్ భూ దాహం..!

Danam Nagender : దానం నాగేందర్ పై గతంలో కూడా చాలానే భూ ఆక్రమణల పేరుతో ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆయన మీద ఇలాంటి ఆరోపణలు అస్సలు ఆగట్లేదు. తాజాగా ఆయన ఏకంగా రూ.30 కోట్ల స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఇప్పుడు ఆయన ప్రతిపక్ష బీఆర్ ఎస్ లో కొనసాగుతున్నా సరే ఇలాంటి ఆరోపణలు అస్సలు ఆగట్లేదు. అసలు ఇంతకీ ఏం జరిగిందో.. మీడియాలో వస్తున్న కథనాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. దానం నాగేందర్ బంజారా హిల్స్ రోడ్ నెం.3లో ఉంటున్నారు.

రీసెంట్ గానే ఇక్కడ ఆయన ఇంద్ర భవనంలాంటి ఇంటిని కట్టుకున్నారు. అయితే ఆయన ఇంటికి ఆనుకుని వెనకాల వెయ్యి గజాల ప్రభుత్వ స్థలం ఉంది. దాన్ని నాగేందర్ కలిపేసుకోవాలని ప్రయత్నాలు చేసినట్టు మీడియా చెబుతోంది. ఇందులో భాగంగానే ఆయన గత దశాబ్ద కాలంగా అక్కడ కార్ పార్కింగ్ చేస్తున్నారు. అయితే ఇంటి నిర్మాణం పూర్తి అయ్యే సమయంలో ఆ స్థలంలో ఇంటి నిర్మాణ సామగ్రిని కూడా వేయించారు. ఇప్పుడు ఇల్లు కట్టుకోవడం పూర్తి అయిన తర్వాత ఆ స్థలాన్ని పూర్తిగా కబ్జా చేయాలనే ఉద్దేశంతో దాని చుట్టూ బ్లూ షీట్స్ కూడా వేయించారు.

Land possession allegations on mla danam Nagender

Land possession allegations on mla danam Nagender

అవి ఎందుకు వేయించారు అని ఎవరైనా అడిగితే నిర్మాణ పనులు జరుగుతున్నాయి కాబట్టి ఎవరికీ బయటకు కనిపించొద్దనే ఉద్దేశంతో ఇలా చేసినట్టు చెబుతుఉన్నారు. కాగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తనకున్న పరిచయాలను అడ్డు పెట్టుకుని దాన్ని కబ్జా చేసేయాలని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అందుకే ఆ స్థలం చుట్టూ సిమెంట్ బ్రిక్స్ తో గోడ కట్టేశారు. కంగారూ స్కూల్ ఉన్న వైపు మాత్రం తాత్కాళికంగా రేకులు అడ్డు పెట్టించారు. అక్కడకు ఎవరూ రాకుండా సెక్యూరిటీని కూడా పెట్టుకున్నారు. అయితే ఈ స్థలాన్ని గతంలో కవి వైతాళికుడు ఆచార్య నారాయణరెడ్డి పేరుతో ఆడిటోరియం నిర్మించేందుకు కేటాయించారంట.

కానీ ఇప్పుడు ఇలా కబ్జాకు గురవుతోందని వార్తలు వస్తున్నాయి. అయితే ఇదే అంశం మీద షేక్ పేట తహశీల్దార్ అనిత రెడ్డిని ప్రశ్నించగా.. ఆ విషయం తమకు తెలియదని.. త్వరలోనే దానిపై విచారణ ప్రారంభిస్తామని తెలిపారు. ఈ నిర్మాణ పనులపై ఎమ్మెల్యేను ప్రశ్నించగా.. నిర్మాణ పనులు పూర్తయిన వెంటనే దాన్ని తొలగిస్తామని చెప్పారు.

అయితే ఇలా ఎమ్మెల్యే దానం నాగేందర్ మీడియా ప్రశ్నించే వరకు మౌనంగా ఉండటం వెనకాల కబ్జా చేయాలనే ఉద్దేశం ఉన్నట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఏదేమైనా ఒక ఎమ్మెల్యే ఇలాంటి పని చేస్తున్నారనే ప్రచారంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News