MLA Arekapudi Gandhi : చేవెళ్లలో సెంటిమెంట్.. కాసాని గెలుపు ఖాయం

Qubetvnews - April 27, 2024 / 08:07 AM IST

MLA Arekapudi Gandhi : చేవెళ్లలో సెంటిమెంట్.. కాసాని గెలుపు ఖాయం

MLA Arekapudi Gandhi :

చేవెళ్ల పార్లమెంట్‌ నియోజక వర్గంలో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ భారీ మెజార్టీతో గెలువబోతున్నారు అంటూ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. నేడు కాసాని గెలుపు కోసం ఎమ్మెల్యే గాంధీ చేవెళ్ల నియోజక వర్గ పరిధిలోని హఫీజ్ పేట్‌ డివిజన్‌ లో గంగారం, మాదాపూర్‌ లలో పాదయాత్ర చేస్తూ బీఆర్‌ఎస్ పార్టీ కరపత్రాలను పంచిపెట్టారు. కేసీఆర్‌ చేసిన అభివృద్దిని వివరిస్తూ, కాంగ్రెస్ పార్టీ మాయమాటలను నమ్మవద్దని, బీజేపీ కి ఓటు వేస్తే దేశం మరింత నాశనం అవ్వడం ఖాయం అంటూ వివరిస్తూ పాదయాత్రను గాంధీ కొనసాగించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్న ఈ ప్రచార కార్యక్రమంకు ఓటర్ల నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్ వచ్చింది.

ప్రచారం తర్వాత ఎమ్మెల్యే గాంధీ మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా వరుసగా చేవెళ్ల పార్లమెంట్‌ స్థానంలో బీఆర్‌ఎస్ జెండా ఎగురుతూ వస్తోంది. కనుక ఈసారి కూడా బీఆర్‌ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలువబోతుంది. చేవెళ్ల గడ్డపై కాసాని ని అత్యధిక మెజార్టీతో గెలిపించి కేసీఆర్‌ కు కానుక ఇద్దాం. మొన్నటి ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా జనాలు పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్ కు మద్దతుగా నిలవడం చూస్తూ ఉంటే రికార్డు స్థాయి స్థానాల్లో అభ్యర్థులు గెలుపొండం ఖాయం అన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో కనీసం ఏ ఒక్క గ్యారెంటీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. రైతులకు రైతు బంధు నిధులు కట్‌ చేయడంతో పాటు వడ్ల ను బోనస్‌ పెట్టి కొనుగోలు చేయడం పక్కన పెడితే కనీసం సక్రమంగా కొనే పరిస్థితి కూడా లేకుండా పోయింది. అందుకే ఈ పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ కు ఓటు వేసి కాసాని జ్ఞానేశ్వర్‌ ను గెలిపించాల్సిందిగా ఆ పార్టీ నేతలు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. బీసీ సంఘం నాయకుడు అయిన కాసాని గెలుపు కచ్చితంగా బీసీ సామాజిక వర్గంకు అత్యంత కీలకం.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News