Kasani Gnaneshwar : కాసాని గెలుపుతో బీసీల ఐక్యత చాటుదాం

Qubetvnews - April 28, 2024 / 09:23 AM IST

Kasani Gnaneshwar : కాసాని గెలుపుతో బీసీల ఐక్యత చాటుదాం

Kasani Gnaneshwar :

చేవెళ్ల బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం అంటూ బీసీ సంఘం నాయకులు అన్నారు.  కాసాని జ్ఞానేశ్వర్‌ కి మద్దతుగా బీసీ సంఘం నాయకులు మరియు సభ్యులు పెద్ద ఎత్తున భేటీ అయ్యారు. బీసీలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి అభ్యున్నతికి పాటు పడ్డ కేసీఆర్‌ గారి వెంట నడుద్దాం అన్నారు. ఇతర పార్టీలతో పోల్చితే బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన ఘనత కేసీఆర్‌ కే దక్కింది. చేవెళ్ల పార్లమెంట్‌ నియోజక వర్గం ను బీసీలకు కేటాయించడం ద్వారా కేసీఆర్‌ కి బీసీల పట్ల ఉన్న ప్రత్యేకతను చాటుకున్నారు. అందుకే బీసీల ఐక్యత చాటే విధంగా కాసాని జ్ఞానేశ్వర్ కి బీసీలం అందరం కలిసి గంపగుత్తగా ఓట్లు వేసి గెలిపిద్దాం అంటూ బీసీ సంఘం నాయకులు చెప్పుకొచ్చారు.

రాజేంద్రనగర్‌ నియోజకవర్గం పరిధిలో మైనార్టీ మహిళల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 2000 మంది మహిళలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మాజీ హోం మంత్రి మహమ్మద్‌ అలీ, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌ తో పాటు కాసాని జ్ఞానేశ్వర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైనార్టీ మహిళలు కాసాని జ్ఞానేశ్వర్‌ కి ఓటు వేసి గెలిపిస్తాం అంటూ హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్ తోనే బీసీలకు రాజ్యాధికారం దక్కుతుందని ఈ సందర్భంగా నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

గత ఎన్నికల్లో కాంగ్రెస్ మాయ మాటలు చెప్పి విజయం సాధించింది. ఆరు నెలల్లోనే వారి మోసం బయట పడింది. ఆరు గ్యారెంటీల పేరుతో దారుణంగా మోసం చేసిన కాంగ్రెస్ కి ఓటర్లు తగిన గుణపాఠం చెప్తారు అని బీఆర్‌ఎస్ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. చేవెళ్ల నియోజక వర్గంలో కాసానిని గెలిపించి కేసీఆర్‌ కి బహుమానంగా ఇద్దాం అంటూ పలువురు నాయకులు పేర్కొన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కాసాని గెలుపుతో చేవెళ్ల నియోజక వర్గం ఎంతో అభివృద్ది చెందుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News