Premalu movie review : ప్రేమలు మూవీ రివ్యూ అండ్ రేటింగ్..
Qubetvnews - March 8, 2024 / 11:26 AM IST
Premalu movie review : కంటెంట్ ఉంటే చిన్న సినిమాలు కూడా సునామీ సృష్టిస్తాయి. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోస్తుంటాయి. అందుకే ఈ నడుమ చిన్న సినిమాలకు కూడా డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలోనే తాజాగా మన ముందుకు వస్తున్న సినిమా ప్రేమలు. మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ఈ మూవీ తెలుగులో రిలీజ్ అయింది. ఇందులో నస్లెన్ కె.గఫూర్, మమితా బైజు ప్రధాన పాత్రల్లో నటించారు. విష్ణు విజయ్ సంగీతం అందించగా గిరీశ్ దర్శకత్వం వహించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
కథ..
సచిన్ (నస్లెన్) నానా కష్టాలు పడి డిగ్రీ కంప్లీట్ చేస్తాడు. తర్వాత అతను పై చదువుల కోసం యూకే వెళ్లాలనుకుంటాడు. కానీ అతని వీసా రిజెక్ట్ కావడంతో ఫ్రెండ్ తో కలిసి గేట్ కోచింగ్ కోసం హైదరాబాద్ కు వస్తాడు. అక్కడ కోచింగ్ అనుకున్నట్టు సాగకపోవడంతో ఒక రెస్టారెంట్ లో పని చేస్తుంటాడు. ఆ క్రమంలోనే అతనికి ఐటీ ఉద్యోగిని అయిన రీను(మామిత బైజు) ను ఓ పెళ్లిలో చూస్తాడు. చూడగానే ఆమెతో ప్రేమలో పడిపోతాడు. ఇంకోవైపు ఆది(శ్యామ్ మోహన్) రీణును ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. కానీ రోజులు గడిచేకొద్దీ రీణు సచిన్ కు దగ్గరవుతుంది. దాంతో ఆమె తనను ప్రేమిస్తుందనుకుని సచిన్ ఆమెకు ప్రపోజ్ చేస్తాడు. కానీ రీను రిజెక్ట్ చేస్తుంది. దాంతో ఆమె ప్రేమను పొందడానికి సచిన్ ఏం చేశాడు, వారిద్దరూ కలిశారా లేదా అనేది థియేటర్లలో చూడాల్సిందే.
నటీనటుల పర్ఫార్మెన్స్..
సచిన్ పాత్రలో బాగానే ఒదిగిపోయాడు నస్లెన్. ఈ పాత్రలో అతను పక్కింటి కుర్రాడిలా కనిపించాడు. అమాయకత్వం, ప్రేమ, అదే సమయంలో తక్కువ కాన్ఫిడెన్స్ యాటిట్యూడ్ చూపించిన తీరు అద్భుతం. ఇక హీరోయిన్ గా చేసిన మమిత కూడా క్యూట్ గా కనిపించింది. తన పాత్రను పర్ఫెక్ట్ గా చేసింది. అంతే కాకుండా పర్ఫార్మెన్స్ పరంగా అదరగొట్టేసింది. క్లైమాక్స్ ఆలో ఆమె నటన బాగానే ఆకట్టుకుంది. ఇక మరో ముఖ్య పాత్రలో నటించిన సంగీత్ ప్రతాప్ కూడా బాగానే నటించాడు.ఆయన కామెడీ టైమింగ్ బాగుంది.
టెక్నికల్ పర్ఫార్మెన్స్..
ఇది చాలా సింపుల్ స్టోరీ. కానీ ఇందులో ప్రత్యేకత ఏంటంటే కథనం. గిరీశ్ ఈ కథను చెప్పడంలో బాగానే సక్సెస్ అయ్యాడు. సచిన్-అమల్, సచిన్-రీను-సచిన్-శ్యామ్ ల మధ్య సన్నివేశాలను ఆయన సృష్టించిన తీరు చూడటానికి విందుగా ఉంటుంది. తెలుగు వెర్షన్ లో మాత్రం “కుర్చిని మదత పెట్టి” వంటి ఎన్నో ట్రెండింగ్ రిఫరెన్స్ లను వాడుకున్నారు రచయిత. “కుమారి ఆంటీ” వగైరా పాత్రలను కూడా ఇందులో ఇమిటేట్ చేయించారు. దీంతో డైలాగుల్లో కొంత ప్రామాణికత వచ్చి ఓ సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది. దీనికి విష్ణు విజయ్ అందించిన సంగీతం బాగుంది. బ్యాక్ గ్రౌండ్ కూడా బాగానే ఆకట్టుకుంది. ఇక ప్రీ క్లైమాక్స్ కు దారితీసే సన్నివేశాల్లో మరింత క్రిస్ప్ ఎడిటింగ్ చేస్తే ఇంకా బాగుండేది.
ప్లస్ పాయింట్లు..
నల్సేన్, మమతల నటన
సినిమాలో ఫన్ పార్ట్
నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్లు
కొన్ని సీన్లు స్లోగా సాగడం
గొప్ప స్టోరీ లైన్ కాకపోవడం
చివరగా..
ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేసే కథల్లో ప్రేమలు కచ్చితంగా ఉంటుందని చెప్పుకోవాలి. కథను మించి హాస్యాన్ని చూపించడంలో గిరీష్ సక్సెస్ అయ్యాడు. అందుకే ఇది వినోదభరితమైందని చెప్పుకోవాలి.
రేటింగ్ః 3 5





